హట్సాఫ్ రామ్‌చరణ్

ram-charan

గోవిందుడు అందరివాడేలే సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ లేదు. నిర్మాత చెప్పినట్టు ఇండస్ట్రీ హిట్ టాక్ రాలేదు. దర్శకుడు చెప్పినట్టు ఐదు తరాలు గుర్తించుకునే సినిమా అనే టాక్ రాలేదు. అభిమానుల ప్రార్దనల ఫలితమెమో డిజాస్టర్ ఫ్లాప్ అనే టాక్ కూడా రాలేదు. అభిమానులు ఊహించినట్టు ఎవరేజ్ టాక్ వచ్చింది.

తమన్ & దేవిశ్రీ మ్యూజిక్ లకు అలవాటై పోయి ఆడియో ఫస్ట్ టైం విన్నప్పుడు ఇవేమి సాంగ్స్ అనిపించినట్టే, సినిమా కూదా రాంగ్ ఎక్సపెటేషన్స్ పెట్టుకున్న వాళ్ళకు ఇదేమి సినిమా అనే టాక్ కూడా వినిపిస్తుంది.ఈ మధ్య ఏ సినిమా చూసినా వెటకారంతో కూడిన కామెడీ ఏక్కువై పోయి అదే ఎంటర్‌టైన్‌మెంట్ అనే భ్రమలో వున్నారు చాలా మంది ప్రేక్షకులు.

90’s లో రావాల్సిన సినిమా అనే టాక్ తో పాటు ఇప్పటి వాళ్ళకు కావాల్సిన పంచ్ డైలాగ్స్ లేవు. అలీ లేడు. బ్రహ్నానందం లేడు.కాని అవి రొటీన్ అని బాదపడే వాళ్ళు కూడా వున్నారు. 90’s లా ఒక కమ్మని తెలుగుసినిమా కావాలని కోరుకునే వాళ్ళు వున్నారు. వాళ్ళకు నచ్చింది.

కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో లేవు అనలేము కాని, కమర్షియల్ ఎలిమెంట్స్‌కే పెద్ద పీట వేసి తీసిన సినిమా కాదు.

కొందరికి మాత్రం బాగా కనెక్ట్ అయ్యింది. మంచి పబ్లిసిటీతో కచ్చితంగా హిట్ రేంజ్ తీసుకొని వెళ్ళవచ్చు. సినిమా ఏ ఉద్దేశంతో తీసారో ప్రేక్షకులకు తెలియజేస్తు, సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు అంతగా పట్టించుకోని కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ను పబ్లిసిటీలో హైలట్ చేస్తే బాగుంటుంది.

ఆవేశంతో ఎక్కువ ఊహించుకున్నా, ‘నిన్నేపెళ్ళాడుతా’ ‘మురారి’ లతో పోల్చుకున్నా .. ఈ సినిమా చెయ్యడం వలన రామ్‌చరణ్ కు కెరీర్ పరంగా పైసా ఉపయోగం లేదనిపించవచ్చు. కూల్‌గా చూస్తే హిరో క్యారెక్టరైజేషన్ చాలా కూల్‌గా వుంటుంది. అతిగా వుండదు. చాలా లిమిటిడ్ గా వుంటుంది. క్షుణంగా చూస్తే కొత్తగా ఏమి చేయకపొయినా చేసిన దాంట్లొ చాలా బాగా చేసాడు. ఇంట్లో ఇటువంటి బాద్యాతాయుతమైన కుర్రాడు కావాలని పెద్ద వాళ్ళందరూ కోరుకొనేలా చాలా బాగా చేసాడు. పెద్ద వాళ్ళకు బాగా కనెక్ట్ అవుతాడు. అనిపిస్తుంది.

హాట్సాఫ్ దేనికి?
ప్రతి సినిమా చెయ్యడానికి ఒక కారణం వుంటుంది. అందరికీ నచ్చేలా తీసినా, అందరికి నచ్చక పొవచ్చు, ఫస్ట్ డే పాజిటివ్ టాక్ తో పాటు నెగిటివ్ టాక్ సహజం. ఒక ట్రెండ్‌తో సాగి పోతున్న తెలుగుసినిమాలకు భిన్నంగా రెండు శతాబ్ధాలు వెనిక్కి వెళ్ళి తీసిన సినిమా ఇది.

టాక్, రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఆ సినిమా చెయ్యడానికి గల కారణాలు చెప్పవలసిన బాద్యత ఆ హిరోపై వుంది.

ఆరెంజ్ మాదిరి గాలికి వదిలేయకుండా ఇలా పబ్లిసిటి చెయ్యడం బాగుంది. ఈ సినిమా చూసి ఏముందిలే అని ఫీల్ అయిన వాళ్ళు కచ్చితంగా సినిమాలో విషయం వుంది. నేను చూసిన కోణం వేరు, వాళ్ళు చెప్పాలనుకున్న కోణం వేరు అని తెలుసుకొని నెగిటివ్ పబ్లిసిటి చేసే వాళ్ళు మారే అవకాశం వుంది.

చిరంజీవి అభిమానులకు చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ రామ్‌చరణ్. ఈ విషయాన్ని మెగా అభిమానులందరూ ఇప్పుడు గ్రహించలేకపొయినా, అది గుర్తించే దిశలో అడుగులేస్తున్న రామ్‌చరణ్‌కు హట్సాఫ్.

Filed Under: Mega FamilyFeatured