హరీష్‌శంకర్ అమెరికా తెలుగుప్రేక్షకులపై ఆశలు

Share the joy
  •  
  •  
  •  
  •  

Screen Shot 2015-09-16 at 7.22.33 PM

సాయి ధరమ్‌ తేజ్‌, రెజీనా జంటగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర మూవీస్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది.

హిరొ/డైరక్టర్ మీద నమ్మకంతో టాక్‌తో సంబంధం లేకుండా వాళ్ళ సినిమాను ఎంతమంది చూస్తున్నారు అనేది ఆ హిరొ/డైరక్టర్ స్టామినా అని చెప్పవచ్చు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ అమెరికా కింగ్ – ప్రిమియర్ షో కలక్షన్స్ మాత్రమే కాదు, ఫ్లాప్/ఎవరేజ్ టాక్ వచ్చినా ఆయన సినిమా కలక్షన్స్‌కు ఢోకా వుండదు. ఆ తర్వాత మహేష్‌బాబు అని చెప్పవచ్చు. ప్రిమియర్ కలక్షన్స్ కింగ్. “ఆగడు” వెరీ బ్యాడ్ ఎక్సిపిరియన్స్. బాహుబలితో వీళ్ళద్దిరినీ నాలుగైదు రెట్ల మార్జిన్‌తో అమెరికా తెలుగుప్రేక్షకులను రాజమౌళి వశం చేసుకున్నాడు. న్యూ కింగ్ “రాజమౌళి”. (కింగ్ చిన్న పదమెమో) మెగా హిరోల్లొ పవన్‌కల్యాణ్ క్రేజ్ చెప్పనవసరం లేదు, చరణ్ ఎవరేజ్ అనుకుంటే, ఈ మధ్య అల్లు అర్జున్ బాగా పికప్ అయ్యాడు.

“భలే భలే మగాడివోయ్” బిగ్ సరప్రైజ్ ఇచ్చింది. సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్, మంచి పబ్లిసిటికి తోడు లాంగ్ వీకెండ్ కలిసిరావడంతో, పెద్ద సినిమాలకు ధీటుగా జనాలు తరిలివచ్చారు. సినిమా టిక్కెట్టు రేటు తక్కువతో అంత కలక్షన్స్ సాధించిందంటే ఎంత మంది చూసారో లెక్కలేసుకొవచ్చు.

హరీష్‌శంకర్ విషయానికి వస్తే, గబ్బర్‌సింగ్‌తో మంచి పేరు సంపాదించుకున్నాడు. మెగా హిరో కాంబినేషన్ వుంది. అమెరికా తెలుగుప్రేక్షకులపై ఆశలు పెట్టుకున్నాడు. టాక్ బావుంటే మంచి కలక్షన్స్ వచ్చే అవకాశాలు వున్నాయి.

Filed Under: Featuredసుబ్రమణ్యం ఫర్ సేల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *