హర్ట్ టచింగ్ సాంగ్ by Devi

npt

ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ శనివారం హైదరాబాద్ లో ప్రత్యేకంగా రిలీజ్ చేసారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటను స్వయంగా రచించి, సంగీతం అందించిన ఈ సాంగ్‌ను దేవిశ్రీ ప్రసాద్ & సాగర్ పాడారు.

ఏ కష్టమెదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించిన
ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం

నేనేదారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా
నీ వెంట నేనున్నానని నను నడిపించిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం

ఏ తప్పు నే చేసినా తప్పటడుగులే వేసినా
ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం

ఏ ఊసు నే చెప్పిన ఏ పాట నే పాడినా
భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం

ఈ అందమైన రంగుల లోకాన
ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో.. ఈ పాటతో.. ఈ పాటతో..

Filed Under: నాన్నకు ప్రేమతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *