హార్ట్ ఎటాక్ లోగో

heartattack

ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే విజయాలతో మంచి జోష్ మీదున్న నితిన్ కథానాయకునిగా స్వీయదర్శకత్వంలో పూరిజగన్నాథ్ ‘హార్ట్ ఎటాక్’ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ రోజూ నితిన్ ట్వీటర్లో రిలీజ్ చేస్తున్నాడు. అలానే ఈ రోజు కూడా చేసాడు. ఈరోజు స్టిల్ ప్రత్యేకత ఏమిటంటే ఈ సినిమా లోగో కూడా వుంది.

ఆదాశర్మ ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ తారాగణం నటించే ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: అమోల్ రాథోడ్, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్.

ఈ సినిమా మహేష్ బాబు ‘1’ & అల్లు అర్జున్ ‘రేసు గుర్రం’ పొటీగా 2014 సంక్రాంతికి రిలీజ్ కానుంది.

Filed Under: Extended FamilyFeatured