‘హార్ట్ ఎటాక్’ తో హ్యాట్రిక్

Nitin

నితిన్ హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘హార్ట్ ఎటాక్’. నితిన్ సరసన ఆదాశర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు: భాస్కరభట్ల, కెమెరా: ఆమోల్ రాథోడ్, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

పూరి జగన్నాధ్ తన డిమాండ్ మేరకు తనకు రెమ్యూనరేషన్ ఇచ్చే నిర్మాతలు లేకపొవడంతో తనే స్వయంగా నిర్మించాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తయింది. 2014 సంక్రాంతికి రిలీజ్ అనే ప్రచారం జరుగుతుంది.

‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాల హిట్స్ తో హుషారుగా ఉన్న నితిన్ తాజాగా ‘హార్ట్ ఎటాక్’ తో హ్యాట్రిక్ సాధిస్తాడా?

‘హార్ట్ ఎటాక్’ సినిమాతో నితిన్ తన సినిమా మార్కెట్ 30 కోట్ల‌కు పెంచుకుంటాడా?

అనే ప్రశ్నలతో పాటు సంక్రాంతికి మహేష్‌బాబు రామ్‌చరణ్ సినిమాలతో పోటిపడగలడా? అనే ప్రశ్నల సమాధానాల కోసం కొన్ని రోజులు ఆగాల్సిందే. నితిన్ డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తున్నాడు.

బద్రి సినిమాతో పవన్‌కల్యాణ్‌కు మాస్ ఇమేజ్ క్రియేట్ చేసి,
ఇడియట్ సినిమాతో రవితేజను స్టార్ హిరోగా చేసి,
పోకిరితోమహేష్‌బాబుకు ఇండస్ట్రీహిట్ ఇచ్చి,
హిరో చొక్కావిప్పటానికే భయపడే మన తెలుగు సినిమాల్లో దేశముదురుతో అల్లు అర్జున్ ద్వారా సిక్స్ ప్యాక్ ట్రెండ్ క్రియేట్ చేసి,
చిరుత ద్వారా మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్‌కు డెబుట్ బెస్ట్ ఫిలిం ఇచ్చి,
బుజ్జిగాడు ద్వారా ప్రభాస్‌కు కొత్త బ్యాడి లాంగ్వేజ్‌ను ఇచ్చిన పూరి జగన్నాథ్,

హార్ట్ ఎటాక్‌తో నితిన్‌కి ఎటువంటి గిఫ్ట్ ఇస్తాడో చూడాలి.

Filed Under: Extended FamilyFeatured