$10కే S/O సత్యమూర్తి

SonOfSataymurthy

త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు పెద్ద హిరో తోడయ్యితే, ఆ సినిమాకు ఓవర్‌సీస్ క్రేజ్ ఊహకందనిది. రేసుగుర్రంతో బన్ని కూడా ఓవర్‌సీస్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు వీళ్లద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు ఇంచుమించు “పవన్ కల్యాన్” “మహేష్ బాబు” సినిమాలకు వున్న క్రేజ్ వుంది.

మంచి సినిమాకు నిజమైన కొలబద్ద “ఎంతమంది చూసారు?” “ఎన్నిసార్లు బోర్ లేకుండా చూసారు?” “పైరసీ ప్రింట్ ఆన్‌లైన్ హల్‌చల్ చేస్తున్నా, థియేటర్‌కే వచ్చి ఎంతమంది చూసారు?”

టిక్కెట్టు ధర వలన “అత్తారింటికి దారేది” ఓవర్‌సీస్ నెం 1 గా వుంది తప్ప, “రేసుగుర్రం” థియేటర్లో చూసిన వాళ్ళ సంఖ్య ఇంచుమించు “అత్తారింటికి దారేది” థియేటర్లో చూసిన వాళ్ళ సంఖ్యతో సమానం.

థియేటర్స్ సంఖ్య పెంచి, $10కే S/O సత్యమూర్తి అందించ గల్గితే, థియేటర్‌కు వచ్చి సినిమా చూసే వాళ్ళ సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశాలు వున్నాయి.

అల్లు అర్జున్ ఈ డెసిషన్ తీసుకొని ఓవర్‌సీస్ లో కూడా ట్రెండ్ సెట్టింగ్ హిరో అనిపించుకొవాలని మెగా అభిమానులు ఆశీస్తున్నారు.

ఎవరేజ్ సినిమాకు మంచి కలక్షన్స్ రావాలన్నా, చిన్న సినిమాలకు కూడా క్రేజ్ రావాలన్నా, క్రేజ్ వున్న పెద్ద సినిమాల ధరలు తగ్గించి సినిమాలను థియేటర్లో చూస్తే వచ్చే థ్రిల్‌ను ఎలా మిస్ అవ్వుతున్నారో తెలియజేయాలి.

సినిమా వ్యాపారం కావడంతో క్రేజ్ వున్న సినిమా రేటును డబుల్ చేసి అభిమానుల దగ్గర నుండి & సినిమా పిచ్చోళ్ళ దగ్గర నుండి డబుల్ కలెక్ట్ చేస్తున్నారు. అభిమానులు ఏమీ ఫీల్ అవ్వరు. ఎందుకంటే తమ హిరో సినిమా ఎంత ఎక్కువ కలెక్ట్ చేస్తే అంత గర్వం వాళ్ళకు.

ఆడియో ఫంక్షన్స్‌లో అభిమానుల మీద లేని ప్రేమను కురిపించే హిరోలు “అదే నిజమైన క్రేజ్” అనే భ్రమలో ఈ విషయంపై నోరు మెదపరు.

నిజమైన క్రేజ్ వున్న హిరో మా సినిమా ఇంత కలెక్ట్ చేసింది అంత కలెక్ట్ చేసిందని కాకుండా .. ఎంత టిక్కేట్ రేట్‌తో కలెక్ట్ చేసిందో కూడా చెపితే బెటర్.

ఓవర్‌సీస్(ప్రత్యేకంగా అమెరికా) పేక్షకులు ప్రతి వీకెండ్, సినిమా చూడటానికి అవకాశం వుంది. కాని చూడకపొవడానికి కారణం టిక్కెట్టు ధర. హిట్ అయితేనే పెద్ద సినిమాను చూస్తున్నారు. క్రేజ్ వుంటేనే చూస్తున్నారు.

క్రేజ్ వున్న సినిమాల టిక్కెట్టు ధర తగ్గించి ప్రేక్షకులకు అందిస్తే, ఎవరేజ్ సినిమాలు & చిన్న సినిమాలు కూడా ఎక్కువ మంది చూసే దానికి ప్రిపేర్ అవుతారని ఓవర్‌సీస్ సినిమా పిచ్చోళ్ల అభిప్రాయం.

ఈ సాహసం చేస్తే బన్నినే చెయ్యలి. “పవన్‌కల్యాణ్” “మహేష్ బాబు” లు చెయ్యలేరు.

Filed Under: Mega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి