50 రూపాయల టిక్కెట్టుకు 100 రూపాయల వినోదం

Mr-Pellikoduku

  • పూలరంగడు సినిమా తర్వాత సునీల్ ఇషా చావ్లా జంటగా నటిస్తున్న సినిమా మిస్టర్ పెళ్ళికొడుకు.
  • అందాలరాముడు సినిమా ద్వారా సునీల్ ను హీరోగా పరిచయం చేసిన మెగా సూపర్ గుడ్ ఫిలిం సంస్థ నిర్మిస్తున్న చిత్రం మిస్టర్ పెళ్ళికొడుకు.
  • లీలామహల్ సెంటర్ బ్లేడ్ బాబ్జీ ఫేమ్ దేవీప్రసాద్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాకు సంబందించిన ఆడియో ఫంక్షన్ నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమా ఆడియోను వివి వినాయక్ విడుదల చేసి తొలి సీడీని నాగచైతన్యకు అందచేశారు.

ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే 50 రూపాయలతో సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకుడికి 100 రూపాయల వినోదం అందించే ప్రయత్నం చేసారంట.

ప్రేక్షకుడిని గౌరవిస్తూ
ప్రేక్షకుడికి నచ్చుతుందో లేదో అనే భయంతో
ప్రేక్షకుడిని మెప్పించే లక్ష్యంగా నిర్మించిన ఈ చిత్రం 100 % హిట్ అవ్వాలి.

Filed Under: Extended FamilyFeatured