నీహారికకు గ‌ర్వం లేదు

ns

నాగ‌శౌర్య‌, నీహారిక జంటగా మధుర శ్రీధర్, టివి9 సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ’ఒక మనసు’. జూన్ 24న రిలీజ్ కాబోతుంది. సినిమా పాటలు స్లోగా వుండటంతో పాటు, స్లో సినిమా క్లాస్ సినిమా అనే ఫీల్ రావడంతో హైప్ లేదు. హైప్ లేకపొయినా, సినిమా హిట్ టాక్ సంపాదించుకుంటే, మంచి కలక్షన్స్ వచ్చే అవకాశం వుంది. సినిమా ఎవరేజ్ టాక్ వచ్చినా కలక్షన్స్ బాగానే వచ్చే అవకాశం వుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫోకస్ అంతా నిహారిక మీద వుంది. నిహారిక కోసం ఒకసారి చూడోచ్చు అని లేడీస్ ఫిక్స్ అయిపొయారు.

నాగ శౌర్య. మెగా డాటర్ నిహారిక మొదటి సినిమాలో నటిస్తున్న హిరో. హిరో హిరోయిన్లు కలిసి వస్తే, ప్రశ్నలన్నీ నిహారికానే అడుగుతున్నారు. సినిమా ప్రమోషన్ కోసం ఇలా ఒక్కడే వచ్చి మంచి పనిచేసాడు.

  1. ఈ సినిమాలో నా పాత్ర పేరు సూర్య. ఈ పాత్ర నా నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది.
  2. పెళ్లి కాకముందు రెండు మనసులుగా ఉన్న పెళ్లయిన తరువాత ఇద్దరూ ఒకే మనసుగా మారిపోవాలన్నది ఈ సినిమా కథ ప్రధానాంశం. హ్యాపీ ఎండింగ్ ప్రేమ కథ.
  3. పొలిటీషియన్ కారెక్టర్ చేస్తున్నా.. పొలిటీషియన్ అనగానే నెగటివ్ కారెక్టర్ అని అనుకోవద్దు
  4. నీహారికతో వర్క్ చేయడం, మొదట్లో కొద్దిగా భయం ఉండేది. అంటే…పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నది కదా…ఎలా ఉంటుందో అని. కానీ తను అందరితో చాలా ఫ్రెండ్లీ గా ఉంటుంది. పెద్ద కుటుంబం నుంచి వచ్చినా ఏమాత్రం గ‌ర్వం లేదు.
  5. విజువల్స్ క్రెడిట్ అంతా దర్శకుడు రామరాజుతో పాటూ కెమెరామన్ రామ్ రెడ్డి గారికి చెందుతుంది. నిజం చెప్పాలంటే ఇంతకు ముందు సినిమా లో కన్నా ఈ సినిమాలో మరింత అందంగా ఉన్నానని అందరూ అంటుంటే దానికి పూర్తిగా కారణం రామ్ రెడ్డి గారే.

Filed Under: Featuredఒక మనసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *