బలహీనుడి బలం “జనతా గ్యారేజ్‌”

ntr-jg

రంజాన్ సందర్భంగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఎన్.టి.ఆర్ “జనతా గ్యారేజ్‌” టీజర్‌ బుధవారం సాయంత్రం విడుదల చేసారు. ఈ టీజర్ కూడా కొరటాల శివ “శ్రీమంతుడు” మాదిరి ఇనిస్టెంట్ అయ్యింది. సమంత, నిత్యామేనన్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో, మలయాళ నటుడు మోహన్‌లాల్‌ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కిస్తున్నారు.

శ్రీమంతుడు బాహుబలి తర్వాత రెండో స్థానంలో నిలిచినా, ఈ సినిమాతో కనెక్ట్ కాని వాళ్ళు చాలామంది వున్నారు. ఫైట్స్ బాగున్నా, లెంగ్త్ ఎక్కువ అయ్యి ఓవర్‌డోస్ అయ్యాయని, కథ చెప్పడంలో కొరటాల శివకు అంత పట్టు లేదని విమర్శలు చేస్తూ వుంటారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఊరును దత్తత తీసుకొవడం అనే కాన్సెప్ట్ అందరికీ బాగా నచ్చడంతో ఆ సినిమా పెద్ద హిట్ అయిపొయింది.

ఇప్పుడు “బలవంతుడు-బలహీనుడు .. బలహీనుడి పక్కన బలంగా నిలిచే హిరో ” ఇలా మాస్‌కు నచ్చే ఒక మంచి లైనుతో టీజర్ అకట్టుకునే విధంగా వుంది. టెంపర్ & నాన్నకు ప్రేమతో సినిమాలతో మంచి ఊపు మీద వున్న ఎన్.టి.ఆర్, అదే ఊపు ఈ సినిమాలో కనబరచడం పెద్ద ప్లస్‌గా కనిపిస్తుంది, వినిపిస్తుంది.

bottomline:
శ్రీమంతుడిని క్రాస్ చెయ్యడమే లక్ష్యంగా పని చేస్తున్న “జనతా గ్యారేజ్‌” సినిమా టీజర్, సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేసే విధంగానే వుంది. హైప్ రీచ్ అవ్వగల్గితే, కలక్షన్స్ రీసౌండ్ రావడం ఖాయం.

టీజర్లో డైలాగ్స్:
బలవంతుడు బలహీనుడ్ని భయపెట్టి బతకడం ఆనవాయితీయే..

బట్‌ ఫర్‌ ఏ ఛేంజ్‌.. ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.

జనతా గ్యారేజ్‌

ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును

Filed Under: జనతా గ్యారేజ్‌

commentscomments

 1. Venkat says:

  Your analysis rocks buddy

 2. Hari says:

  LOL@ Venkat ,,

  I have covered you @ శ్రీమంతుడు బాహుబలి తర్వాత రెండో స్థానంలో నిలిచినా, ఈ సినిమాతో కనెక్ట్ కాని వాళ్ళు చాలామంది వున్నారు.

 3. PK says:

  Yes , lol…you got me 😀

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *