చిరంజీవి సందేశమిస్తే ప్రేక్షకులు నవ్వుతారు

Chiranjeevi-and-Kodandarami

చిరంజీవి, తన 150వ సినిమాగా తమిళంలో హిట్టయిన ‘కత్తి’ ని ఎంచుకొని వివి వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్, ఆ సినిమా 150 కోట్లు షేర్ సాధించాలని వి.వి. వినాయక్‌కు గట్టిగా చెప్పాడని కూడా అందరికీ తెలిసిందే.

150వ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్న మాట నిజమే, కాని కత్తి సినిమా రిమేక్ చెయ్యడం చాలా మంది అభిమానులకు ఇష్టం లేదు. కారణం ఆ సినిమాలో హిరో రైతుల కోసం పొరాడే వ్యక్తి. రాజకీయల ద్వారా మన అన్నయ్య చిరంజీవి నిజ జీవితంలో పొరాడలేని ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఆ ఇమేజ్‌తో చిరంజీవి ఈ రకమైన సందేశమిస్తే ప్రేక్షకులు నవ్వుతారెమోనని చిరంజీవిని మెగాస్టార్ చేసిన దర్శకుడు కోదండరామిరెడ్డి అంటున్నాడు (చిరంజీవిని మెగాస్టార్ చేసింది అల్లు అరవింద్ అనేవారు కూడా వున్నారు). నిజానికి రాంగోపాలవర్మ కూడా అదే ఫీల్ అయ్యి, పూరి జగన్నాధ్‌తో అవుట్ & అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా చెయ్యాలని అభిప్రాయపడ్డాడు.

మరోపక్క, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న వి.వి. వినాయక్, ఈ సినిమా హిట్ కాకపొతే తను సినిమాలు మానేస్తానని తొడగొడుతున్నాడు. సినిమా హైప్ చెయ్యడానికి, బిజినెస్ బాగా చేసుకొవడానికి సినిమా మేకర్స్ ఇటువంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వడం సహజమే.

చిన్న ఛాన్స్ దొరికితే చాలు:
ప్రస్తుతం పవన్‌కల్యాణ్ మీద కేవలం జగన్ మీడియా మాత్రమే నెగిటివ్ ప్రచారం చేస్తుంది. అన్నయ్య చిరంజీవి మీద మాత్రం అటు తెలుగుదేశం మీడియా, ఇటు జగన్ మిడియా, ఇద్దరూ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని రాద్దాతం చెయ్యడం ఖాయం.

అందరిలానే కోదండరామిరెడ్డికి కూడా చిరంజీవితో మనస్పర్ధలు వున్నట్టు వున్నాయి. ఒకప్పుడు తమతో అందరిలో ఒకడిలా వుండే చిరంజీవి, అప్పట్లో అవకాశాల కోసం తమకు ఎంతో గౌరవాన్ని ఇచ్చిన చిరంజీవి, ఇప్పుడు గ్యాప్ మెయింటేన్ చేస్తున్నాడనే భావన చాలామంది ఇండస్ట్రీ పెద్దల్లో(ముసలోళ్ళు) వుంది. దాసరి, తమ్మారెడ్డి, బాల సుబ్రమణ్యం and so on. కోదండరామిరెడ్డి మాటల్లో నిజం వున్నా, చిరంజీవి అవమానించినట్టుగా వున్న ఈ అనవసరమైన స్పీచ్‌తో, ఆ లిస్టులో కోదండరామిరెడ్డి కూడా ఒకడని స్పష్టమవుతుంది.

Filed Under: ఖైదీ నెం 150

commentscomments

  1. PK says:

    manam anukunna de….:D eppudooo anukunnam 😛

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *