“జనతా గ్యారేజ్‌” ఎన్.టి.ఆర్ లక్ ఎలా వుందో

NTR luck

అందరు హిరోలు కష్టపడుతున్నారు. మంచి దర్శకులను ఎంచుకుంటున్నారు. కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాటికి లక్ కలిసొస్తేనే అభిమానులు ఆశీంచే రేంజ్ సినిమా అయ్యే ఛాన్స్ వుంది. ఎన్.టి.ఆర్ పెరఫార్మన్స్ పరంగా గత రెండు సినిమాలు టెంపర్ & నాన్నకు ప్రేమతో మంచి పేరు తెచ్చిపెట్టినా, హిట్ అనిపించుకున్నా కలక్షన్స్ అభిమానులు కలర్ ఎగరేసేంత లేవు. “జనతా గ్యారేజ్‌” ఎన్.టి.ఆర్ లక్ ఎలా వుందో తెలియాలంటే మరో నెల ఆగాల్సిందే.

కొరటాల శివ దర్శకుడిగా మారిన మంచి కథా రచయిత అయినా, “శ్రీమంతుడు” విషయంలో చాలా లక్ కలిసొచ్చిందని అనుకొవాలి. బాహుబలి కోసం శ్రీమంతుడు సినిమాను ఒక నెల పోస్ట్‌పోన్ చెయ్యడంతో, పొస్ట్ ప్రొడక్షన్ పని హాడావుడిగా కాకుండా, మంచి టైం దొరికింది. ఆ సినిమాలో నెగిటివ్ అనిపించిన కొన్ని విషయాలు, హిరో మహేష్‌బాబు కావడంతో అంత ప్రభావం చూపలేకపొయాయి.

“జనతా గ్యారేజ్‌” రిలీజ్ టార్గెట్ పెట్టుకొని కొద్దిగా హాడావుడి పడుతున్నట్టు కనిపిస్తుంది. కొరటాల శివ ఒత్తిడిని తట్టుకొని మంచి అవుట్‌పుట్ ఇవ్వగలడో లేదో. ఎన్.టి.ఆర్ లక్ మీద ఆధారపడి వుంది.

.

Filed Under: జనతా గ్యారేజ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *