తిక్క

SDT

పైకి చిరంజీవి విమర్శలు లైటుగా తీసుకున్నట్టు అనిపించినా, రాజకీయ వైఫల్యంతో చిరంజీవిలో అభద్రతాభావం ఎక్కువై పోయింది. ఈ మధ్య పొగడ్తల కోసం ఎగబడుతున్నట్టు, ఆరాటపడుతున్నట్టు కనిపిస్తున్నాడు.

దాని ప్రభావం రామ్‌చరణ్ పై పడేట్టు వుంది. ఎందుకంటే ఒక పక్క అల్లు అర్జున్ & ఇంకో పక్క సాయిధర్మ్‌తేజ్ లు రామ్‌చరణ్ ను మించి జనాదరణ పొందుతున్నారని ప్రచారం జోరుగా జరుగుతుంది.

అల్లు అర్జున్ & సాయిధర్మ్‌తేజ్ లు వాళ్ళు ఎన్ని విజయాలు సాధించినా మెగా అభిమానులకు చిరంజీవి .. పవన్ కల్యాణ్ .. రామ్ చరణ్. వాళ్ళకు ఎన్ని విజయాలు వచ్చినా .. చిరంజీవి కాని, పవన్ కల్యణ్ కాని, రామ్ చరణ్ కాని .. అసలు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఒక వర్గం పవన్‌కల్యాణ్ మీద దుష్పాచారం చేసినట్టుగానే, ఇప్పుడు మరో వర్గం రామ్‌చరణ్ మీద చేస్తూనే వుంటుంది. ప్రస్తుతం, రామ్‌చరణ్ కూల్‌గా కనిపిస్తున్నా, ఒక వర్గం రిపీట్‌గా చేస్తున్న ప్రచారంతో విసిగిపొయే అవకాశం వుంది.

సాయి ధర్మ్ తేజ్‌కు ఇరగదేసేసిన హిట్ లేకపొయినా, వరుస మాస్ హిట్స్‌తో జనాల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎంత ఆదరణ అంటే మాస్‌లో నెక్స్ట్ మెగాస్టార్ అనే రేంజ్‌లో వుంది. లేటెస్ట్ ఫిల్మ్ ‘తిక్క’ అన్ని కార్యక్రమాలను ముగించుకుని ఆగష్టు 13న రిలీజ్ అవుతోంది.

గత మూడు సినిమాలు డైరక్టర్స్ ఇమేజ్ కు తోడు దిల్ రాజు వెనుక వుండటంతో, సాయి ధర్మ్ తేజ్ మీద ఒత్తిడి తక్కువ వుంది. ఈసారి మాత్రం మాస్‌లో హై ఎక్సపేటేషన్స్ వున్నాయి. ఈసారి కూడా హిట్ అనిపించుకుంటే, వచ్చే కిక్కే వేరప్ప. good luck to SDT.

Filed Under: Featuredతిక్క

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *