ధృవ టీజర్ ఫెయిల్ అవ్వలేదు

rc

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ధృవ’. తమిళంలోఘన విజయం సాధించిన ‘తనీఒరువన్‌’ రీమేక్‌. ఈ సినిమా కోసం రామ్‌చరణ్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించడం కోసం కండలు పెంచారు. మీసకట్టు స్టైల్ మార్చారు. ఈ సినిమా టీజర్‌ను విజయదశమి కానుకగా విడుద‌ల చేశారు. తేడా వస్తే సోషల్ నెట్‌వర్కింగ్ లో వచ్చే కామెంట్స్ తట్టుకొవడం కష్టమవుతున్న రోజులివి. చిరంజీవి వారసుడిగా ఎంతో మంది నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న రామ్‌చరణ్, ఆ విమర్శలను ఒక ఛాలెంజ్‌గా తీసుకొని తాను తీసుకొవల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ధృవ టీజర్ ఫెయిల్ అవ్వలేదని ‘తనీఒరువన్‌’ చూసినోళ్ళు అంటున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ టీజర్లో “నీ స్నేహితుడెవ‌రో తెలిస్తే నీ క్యారెక్ట‌ర్ తెలుస్తుంది..నీ శ‌త్రువు ఎవ‌రో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది..నా శ‌త్రువుని సెలెక్ట్ చేసుకున్నా” అని రామ్‌చరణ్ చెప్పే డైలాగ్ మెగాఫ్యాన్స్‌కు మాత్రమే కాదు, అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది.

గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. విలన్‌గా అరవింద్ స్వామి, ఒక కీలక పాత్రలో నవదీప్ నటిస్తున్నారు.

Filed Under: Featuredధృవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *