బాహుబలి-2 కి భయం లేదు.. భయపడటం లేదు

Share the joy
  •  
  •  
  •  
  •  

bb2

తెలుగుసినిమాకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చిన సినిమా బాహుబలి అంటే అది నిజం. ఎవరైనా అంతర్జాతీయ స్థాయిలో వుందంటే మాత్రం, అది పచ్చి అబద్ధం. సినిమాలో కొన్ని గ్రాఫిక్స్ మరీ పేలవంగా వుంటాయి. కథా పరంగా అహా ఓహో అనే కథ కూడా కాదు.

అంత భారీ కమర్షియల్ విజయానికి ఒకే ఒక కారణం రాజమౌళి. రాజమౌళి వ్యూహం & రాజమౌళి మ్యాజిక్ పరఫక్ట్‌గా వర్క్ అయ్యాయి. అది ఒక్క రాజమౌళికి మాత్రమే సాధ్యం. మాస్ పల్స్ అంతలా పట్టేసాడు. అదేమిటనేది వేరే వాళ్లకు అర్దం కావడం లేదు & రాజమౌళిని ఎవరూ ఫాలో కాలేకపొతున్నారు.

బాహుబలి-1 సినిమాకు అంత భారీ ఖర్చు పెడుతున్నారనే భయం ఆ చిత్ర యూనిట్‌కు వుంది. ఆ సినిమాలో ఏమి వుంటుందో అని, అంత భారీ సినిమాకు పోటీగా రిలీజ్ చెయ్యడానికి హిరోలందరూ ఎంతో భయపడ్డారు.

కాని ఇప్పుడు, బాహుబలి-2 కి హిరోలెవ్వరూ భయపడుతున్నట్టు కనిపించడం లేదు. బాహుబలి-2 కి ముందే రావడానికి పవన్‌కల్యాణ్ & మహేష్‌బాబు సినిమాలు ప్లాన్ చేసుకొని కలక్షన్స్ లాగేసుకునే పనిలో వున్నారు. బాహుబలి-2 తర్వాత కూడా , వేరే సినిమాలు ఎంత గ్యాప్ ఇస్తారో తెలియదు.

బాహుబలి-2 పై ఎక్సపెటేషన్స్ వున్నాయి. హైప్ మాత్రం ఎక్సపెటేషన్స్ కు తగ్గట్టు లేదు. కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ఒక దిక్కుమాలిన ప్రశ్నతో హైప్ చేసే ప్రయత్నం చేసారు కాని, జనాలు అంత ఇంటరెస్ట్ చూపించలేదు.ఇప్పుడు ఎవరూ ఇంటరెస్ట్ చూపని & అంత అవసరం లేని VR technology అని హైప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హైప్ చెయ్యడానికి ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు విఫలం అని చెప్పవచ్చు. ఇంకా చాలా సమయం వుంది కాబట్టి, ఏ విధంగా రాజమౌళి హైప్ క్రియేట్ చేస్తాడనేది చుడాలి.

బాహుబలి-1 ప్రమోషన్స్ ఒక భయంతో చేసారు. కాని ఆ భయం ఇప్పుడు కనిపించడం లేదు. చాలా ధీమాగా వున్నారు. బాహుబలి-1 ను మించి 2 వుంటుందనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో వున్నట్టు కనిపిస్తుంది.

bottomline:

  1. బాహుబలి-2 టీంకు భయం లేదు..
  2. బాహుబలి-2 కి హిరోలెవరూ భయపడటం లేదు.
  3. రాజమౌళి వ్యూహం .. రాజమౌళి మ్యాజిక్ .. రాజమౌళి మాస్ పల్స్ క్యాచ్ .. ఎవరూ రిపీట్ చెయ్యలేకపొతున్నారు..

Filed Under: బాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *