thanks to Ram Charan and Allu Aravind

Share the joy
  •  
  •  
  •  
  •  

rc

మెగా అభిమానులకు కృతజ్ఞతలు. పైనున్న దేవుడు మాకు కన్పించడు కాని, క్రింద వున్న దేవుడు అయితే మీలానే వుంటాడెమో

Ram Charan

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న స్ట‌యిలిష్ ఎంట‌ర్ టైన‌ర్ `ధృవ‌`. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆదివారం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను హైద‌రాబాద్ యూస‌ఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో అభిమానుల స‌మ‌క్షంలో గ్రాండ్‌గా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా, రామ్‌చరణ్ మెగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఆకట్టుకున్నాయి. అల్లు అరవింద్ స్పీచ్ కూడా బాగుంది.

అభిమానించడం అంటేనే వెర్రి. ఇక అభిమానులు వెర్రోళ్ళు అని చెప్పాల్సిన పని లేదు. పాలాభిషేకాలు .. థియేటర్ దగ్గర బ్యానర్లు .. అంతే కాదు, అభిమానం పిచ్చిలో పడి ప్రాణాలు కూడా పొగొట్టుకున్న వెర్రి & పిచ్చి అభిమానులు ఎంతో మంది వున్నారు.

అటువంటి అభిమానులకు గౌరవం కలిపించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అభిమానులు వెర్రి పనులే కాదు, రక్తదానం చేయగలరు. నేత్రదానం చేయగలరు. వారిని సరైన మార్గంలో పొటీ పడేలా చేసిన శక్తి చిరంజీవి. వాళ్ళు వెర్రోళ్ళే కావొచ్చు. వాళ్ళ వెర్రితనం వలనే మీ క్రేజ్ ప్రపంచం నలుమూలలకు చాటుతుంది. అటువంటి వెర్రివాళ్ళు తప్పు చేస్తున్నట్టు అనిపిస్తే మందలించవచ్చు. కాని అవమానించే విధంగా మాట్లాడటం తప్పు.

అభిమానులను దేవుళ్లతో పోల్చినందుకు thanks to Ram Charan.

అభిమానుల గురించి మంచి మాటలు మాట్లాడిన అల్లు అరవింద్ గారికి కూడా థాంక్స్.

Filed Under: Featuredధృవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *