ధృవ రైటరే రియల్ హిరో – రాజమౌళి

My full appreciation to charan and surendarreddy for keeping the story infront instead of image which made Dhruva intresting and captivating from beg till end.Charan looks great with his fantastic physic.performed very well with subtle expessions through out. Rakul is ravishing.👍

Aravind swamy already proved in tamil version and he does no less here. Greatjob. full marks to the writer who did a fabulous job.Real hero.

— RAJAMOULI

రాజమౌళి హై సక్సస్‌లో వున్నాడు. ఆయన ప్రతి చర్యలో ప్రతి మాటలో లేని అర్దాలను జత చేసే అవకాశం వుంది. ఏ సినిమా అయినా ఒక మంచి కథ, ఆ కథకు దర్శకుడి విజన్, ఆర్టిస్ట్లు పెరఫార్మన్స్, మ్యూజిక్ & స్టార్స్ ఫాలోయింగ్ .. ఇలా అన్నీ కలిసొస్తేనే ఒక మంచి సినిమా వస్తుంది, ఆ సినిమా ప్రేక్షకులందరూ ఆదరిస్తారు.

మన ఇండియన్ సినిమా హిరో మీద హిరో ఇమేజ్ మీదే నడుస్తూ వుంటుంది. హిరో అవకాశం ఇస్తేనే ఎంత పెద్ద దర్శకుడైనా, ఎంత మంచి కథైనా తెర మీద ప్రేక్షకులకు చూస్తే అవకాశం వస్తుంది, నిర్మాత పెట్టుబడికి డబ్బులు వెనక్కి వస్తాయి.

రాజమౌళి కథ తీసుకొని వెళ్ళి తెలుగు టాప్#2 హిరోలు అయిన మహేష్‌బాబు & పవన్‌కల్యాణ్ లాంటి స్టార్స్ కు వినిపించి, వాళ్ళకు నచ్చితేనే వాళ్ళ కాంబినేషన్‌లో సినిమా వస్తుంది తప్ప, రాజమౌళి సినిమా చేసేస్తాను అంటే ఆ హిరోలు గంగిరెద్దులా చేసేయరు. పవన్‌కల్యాణ్ అయితే ఇంకా దారుణం, తన మనసులోని లైను చెప్పి, కథ డెవెలప్ చేసుకు రమ్మంటాడు. అలా చేస్తేనే రాజమౌళితో సినిమా చేస్తాడు.

హిరో డామినేషన్ అంతలా వుంది మన తెలుగు సినిమా ఇండస్ట్రిలో. మన తెలుగు సినిమా మాత్రమే కాదు, ఇండియన్ సినిమా పరిస్థితే అలా వుంది.

మెగాఫ్యామిలీ తనకు ఇవ్వల్సిన గుర్తింపు ఇవ్వలేదనో, మరేదో కారణమో, మగధీర విషయంలో రాజమౌళి అవమానంగా ఫీల్ అయినట్టు వున్నాడు. మగధీర తన ఇమేజ్‌నే మార్చేసిందనే విషయం ప్రస్తావించకుండా, ఎక్కడైనా మగధీర గురించి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ వుంటాడు.

ఇప్పుడు ధృవ విషయంలో ఒక పక్క రామ్‌చరణ్‌ను పొగుడుతూనే, కథ వ్రాసిన రైటర్‌ను రియల్ హిరో అనడం, తెలుగు మీడియాలో ఎటువంటి ఊహాగానాలకు దారి తీస్తుందో చూడాలి.

Filed Under: ధృవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *