బాహుబలికి ధీటుగా ..

తెలుగువాళ్ళు, ఇది మా తెలుగుసినిమా అని గర్వంగా చెప్పుకునే సినిమాలు ఏమైనా వుంటే, వాటిల్లో దర్శకుడు క్రిష్ సినిమాలు కచ్చితంగా వుంటాయి. నందమూరి బాలకృష్ణ తన వందో సినిమాను ఈ దర్శకుడికి అప్పగించడం ఫలితమే ఈ భారీ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చారిత్రక చిత్రం అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. శాతకర్ణి జన్మస్థలం అయిన కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో ఈ ట్రైలర్ను రిలీజ్ చేశారు. అఖండ భారతాన్ని పరిపాలించిన శాతకర్ణి కథతో భారీ యుద్ధ సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. బాలయ్య సరసన శ్రియా హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలినీ బాలకృష్ణ తల్లి పాత్రలో కనిపించనున్నారు. కన్నడ స్టార్ హీరో శివ రాజ్కుమార్, శాతకర్ణి కొడుకు పాత్రలో నటిస్తున్నాడు.

ఫాంటసీ సినిమా కాదు కాబట్టి కమర్షియల్ రేంజ్ పరంగా బాహుబలితో పోల్చడం సరికాకపోయినా, మేకింగ్ పరంగా ట్రైలర్ బాహుబలికి ధీటుగా వుంది. కేవలం 8 నెలల్లో ఈ క్వాలిటీతో నిర్మించడం అంటే మాములు విషయం కాదు. hats off to Krish

Filed Under: గౌతమీపుత్ర శాతకర్ణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *