చిరంజీవి రేంజ్‌లో లేదు కాని ..

  1. హై ఎక్సపెటేషన్స్ వున్నప్పుడు, ఏమి చేసినా, ఏమి ఇచ్చినా “not upto expectations” ఆనే మాట సహజం.
  2. ఫ్యాన్స్ కాబట్టి, ఎలా వున్నా, ఎలా అనిపించినా, వేరే ఫ్యాన్స్‌కు లోకువ అవ్వకుండా వుండటానికి, “చాలా బాగుంది” అనే చెప్పాలి, లేకపొతే కామ్ గా వుండాలనే రూల్స్ కూడా చాలా వున్నాయి.
  3. pawanfans.com కు కూడా కొన్ని  ఆంక్షలు & హద్దులు వున్నాయి .  వాటికి లోబడే మా వార్తలు వుంటాయి. అపార్దం చేసుకోకుండా, సరిగ్గా అర్దం చేసుకొవాలని మనవి.

ఫస్ట్ హియరింగ్‌లో ఫ్యాన్స్ టాక్:

  1. చిరంజీవి 150వ సినిమాకు వినాయక్ దర్శకుడు అనగానే పరమ రొటీన్ మాస్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపొయారు కాని, బాస్‌కు ఠాగూర్ ఇచ్చాడు కాబట్టి ఇంకా కొన్ని ఆశలు మిగిలివున్నాయి. ఈ పాట మరికొన్ని అనుమానాలు క్రియేట్ చేసింది. అన్నయ్య తన ప్రెజెన్స్‌తోనే ఈ పాటను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్ళాల్సిన పరిస్థితిలా వుంది.
  2. వినాయక్ కు అంటూ ఏం మార్క్ లేదు. పూర్తిగా దేవిశ్రీ ప్రసాద్‌కు వదిలేసినట్టు వున్నాడు. దేవిశ్రీనే పాడేసి పరమ రొటీన్ పాట అనిపించేలా చేసాడు. చిరంజీవి రేంజ్‌లో లేదు.
  3. ఘారానా మొగుడు సినిమాలో “బంగారు కోడిపెట్ట” సాంగ్ కాని, ఇంద్ర సినిమాలో “దాయి దాయి దామా” సాంగ్ కాని, ముందు ఆడియో విన్నప్పుడు చాలా చాలా సాదా సీదా సాంగ్స్ అనిపించినవే. మంచి కంపోజింగ్, అన్నయ్య ప్రెజెన్స్ .. ఆ పాటలను వేరే రేంజ్‌కు తీసుకెళ్ళాయి. ఈ పాట మీద అప్పుడే ఒక కన్‌క్లూజన్‌కు వచ్చేయకుండా, సినిమా విజువల్స్ వచ్చేదాకా ఆగాల్సిందే.

Filed Under: Featuredఖైదీ నెం 150

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *