War looks completely ONESIDED

Share the joy
  •  
  •  
  •  
  •  

Ram Gopal Varma ‏@RGVzoomin Dec 16
After Satakarni fights
there is no more Sankranthi
Fight ..War looks completely ONESIDED @DirKrish

గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ రికార్డ్ ల‌ను సృష్ఠించింది. వందో చిత్రంలో బాలయ్య రాజసం ఉట్టిపడేలా ఉన్నారు. డైలాగులు అదరగొట్టారు. చిత్రంలో గ్రాఫిక్స్ చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు. యూ ట్యూబ్ లో ఈ ట్రైలర్ ను వదిలిన 5 గంటల్లోనే 1మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. 24 గంటలు గడిచేలోగా 2.13 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటివరకూ టాలీవుడ్ లో ఏ సినిమా ట్రైలర్ కి ఇంత సమయంలో ఈ స్థాయి వ్యూస్ రాలేదని చెబుతున్నారు. ఇది బాలయ్య సాధించిన తొలి రికార్డ్ అని అంటున్నారు. దర్శకుడు క్రిష్ మొదటి నుంచి ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ వచ్చాడు. బాలకృష్ణ కూడా తన కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమని చెబుతూ వచ్చారు. ఇక బాలకృష్ణ అభిమానులు చేపడుతూ వచ్చిన ప్రచార కార్యక్రమాలు కూడా ఈ సినిమా వైపుకి అందరి దృష్టిని మళ్లించాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా “ఖైదీ నెం 150” కూడా రిలీజ్ అవుతుంది. ఖైదీ నెం 150 ట్రైలర్ రిలీజ్ కాలేదు, కాని ఆ సినిమా రిమేక్ కాబట్టి, ఆ సినిమా కథంతా అందరికీ తెలుసు. ఈ సంక్రాంతి పొటీలో ఖైదీ నెం 150 పై గౌతమీపుత్ర శాతకర్ణి విన్ అవుతాడని రాంగోపాలవర్మ అభిప్రాయపడుతున్నాడు. ఖైదీ నెం 150 సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని కూడా రాంగోపాలవర్మ అభిప్రాయపడుతున్నాడు.

ఇంతకు ముందు రాంగోపాలవర్మ “క్షణ క్షణం”, చిరంజీవి “రౌడి అల్లుడు” సినిమాలు ఒక వారం గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. “క్షణ క్షణం” కమర్షియల్‌గా ఫ్లాప్ అయినా, చాలా మంది తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ క్లాస్ మూవీ. రౌడి అల్లుడు మాత్రం కమర్షియల్ హిట్ మాత్రమే కాదు, ఆ సినిమా కూడా చాలా మందికి ఫేవరేట్ మూవీ.

మాస్ నేపధ్యంలో క్లాస్ సినిమాలు నిర్మించే క్రిష్ సినిమాలు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకొవడంలో వైఫల్యం చెందుతూ వుంటాయి, కాని ఈసారి యుద్ధ నేపధ్యం & బాలయ్య తోడవ్వడంతో రిలీజ్‌కు ముందు సూపర్ డూపర్ హైప్ తెచ్చుకుంది. ఖైదీ నెం 150 రిమీక్ కావడంతో పాటు, ఇప్పటివరకు రిలీజ్ చేసిన్ స్టిల్స్ మాస్‌ను ఆకట్టుకొవడానికే అన్నట్టు వుండటంతో వెబ్ ప్రపంచంలో గౌతమి పుత్ర శాతకర్ణి కంటే ఖైదీ నెం 150 వెనుకబడిపోయింది.

అలా అని ఖైదీ నెం 150 సినిమాను తీసిపాడేయ్యలేము. చిరంజీవి ప్రెజెన్స్ , మంచి కథ-స్క్రీన్‌ప్లే & వినాయక్ మాస్ టేకింగ్ .. విడుదల అయ్యాక ఈ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకునే అవకాశాలు వున్నాయి. రాంగోపాలవర్మ వూహిస్తున్నట్టు War ONESIDED అయ్యే ప్రశ్నే లేదు.

bottomline:

  1. గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ అదిరిపోయింది. as of now, dominates చిరంజీవి ఖైదీ నెం 150
  2. రాంగోపాలవర్మ వూహిస్తున్నట్టు War ONESIDED అయ్యే ప్రశ్నే లేదు. చిరంజీవి ఖైదీ నెం 150 సినిమాకు చిరంజీవి ప్రెజెన్స్ , మంచి కథ-స్క్రీన్‌ప్లే & వినాయక్ మాస్ టేకింగ్ .. ను తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్టే.
  3. గౌతమీపుత్ర శాతకర్ణి విజువల్స్ బాహుబలికి ధీటుగా వుండటమే కాదు, బాహుబలికి ధీటుగా కలక్షన్స్ కూడా సాధిచాలంటే ఇటువంటి పోటీ వాతావరణంలో రిలీజ్ కావడం ఈ సినిమాకు పెద్ద మైనస్(మృగరాజు సినిమా మాదిరి ఖైదీ నెం 150 అట్టర్ ఫ్లాప్ అయితే డబుల్ ఏడ్వాంటేజ్ అవుద్ది.కాని అలా అనుకొవడం తప్పు). అదే సమయంలో దిల్ రాజు “శతమానం భవతి” అనే క్లాస్ సినిమా వుండటం కూడా ఈ సినిమాకు దెబ్బ.

Filed Under: గౌతమీపుత్ర శాతకర్ణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *