ఈసారి ఘోరమైన ఫ్లాప్ అయ్యే సూచనలు లేవు

పవన్ కల్యాణ్, శృతి హాసన్ ల కాంబినేషన్ లో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాత శరత్ మరార్ , దర్శకుడు కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. మూలకథ తమిళ్ సినిమా నుంచి తీసుకున్నది అయినా, పవన్‌కల్యాణ్ ఆలోచనలు & ఆదేశాల మేరకు మార్పులు వుంటాయి. పవన్‌కల్యాణ్ ఇక రకమైన ట్రాన్స్‌లో అనుకున్న పాయింట్‌కు దర్శకుడు బాబీ బలవంతంగా కనెక్ట్ అయ్యి చేసిన సర్దార్ గబ్బర్‌సింగ్ ఫ్లాప్ అవ్వడంతో, ప్రస్తుతం పవన్‌కల్యాణ్ చేస్తున్న కాటమరాయుడు సినిమాపై అంచనాలు చాలా మటుకు తగ్గాయని చెప్పవచ్చు.రిఫరెన్స్‌గా తమిళ్ సినిమా వుంది కాబట్టి, ఈసారి దర్శకుడు డాలీ పవన్‌కల్యాణ్ ఆశించే విధంగా పవన్‌కల్యాణ్‌కు కనెక్ట్ అయ్యి మార్పులు చెయ్యడానికి అవకాశం వుంది. ఈ సినిమా సర్దార్ గబ్బర్‌సింగ్ అంత ఘోరమైన ఫ్లాప్ అయ్యే సూచనలు లేవు. స్టిల్స్ చూస్తుంటే తీన్‌మార్ అర్జున్ పాల్వాయ్ రోల్ పొడిగింపుగా ఈ సినిమా వుండే అవకాశం వుంది. డీసెంట్ హిట్ ఎక్సపెట్ చేయవచ్చు.

ఈ చిత్ర బృంధం విజయవంతంగా పొల్లాచ్చిలో షూటింగ్ పూర్తిచేసుకొని హైదరాబాద్ కి తిరిగి వచ్చింది.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ “చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ‘గబ్బర్ సింగ్ ఘనవిజయం తరువాత పవన్ కల్యాణ్,శృతి హాసన్ ల కాంబినేషన్ “కాటమరాయుడు”లో మరోసారి కనువిందు చేయబోతోంది. “పొల్లాచ్చి లో పవన్ కల్యాణ్, శ్రుతి హాసన్ కాంబినేషన్ లో చిత్రీకరించిన సన్నివేశాలు, పాట చాలా అద్భుతంగా చిత్రీకరించారు” అని నిర్మాత శరత్ మరార్ చెప్పారు.

దర్శకుడు కిశోర్ పార్దసాని పవన్ కల్యాణ్ గారితో రెండవ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. మిగిలిన షూటింగ్ పార్ట్ జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూర్తి చేయటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి లో ‘ఉగాది’ కి విడుదల అవుతుంది అన్నారు.

చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మిత మవుతున్న ఈ కాటమరాయుడు చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మన్ గా వర్క్ చేస్తున్నారు.

Filed Under: కాటమరాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *