రాంగోపాలవర్మపై మీడియా కక్ష సాధింపు

తెలివితేటలకే తెలివితేటలు నేర్పించగల జీనియస్‌లకే జీనియస్ రాంగోపాలవర్మ. మీడియాను వెర్రిపప్పలు చెయ్యడంలో సిద్ధిహస్తుడు.”రెడ్డి గారు పొయారు” అనే సినిమా తీస్తున్నాను అని జస్ట్ ఎనౌన్స్‌మెంట్‌తో సాక్షి మీడియాను తన అధీనంలోకి తెచ్చుకున్న ఘనుడు రాంగోపాలవర్మ. ఒకోసారి నిజంగా పొగుడుతూ, ఒకోసారి వెటకారంగా పొగుడుతూ .. అబద్ధాలు నిజాలు రెండూ మిక్స్ చేసి ట్వీట్లు రూపంలో వదులుతూ వుంటాడు. చాలా సార్లు మీడియా కన్‌ఫ్యూజ్ అయ్యి, అభాసుపాలు అవుతూ వుంటుంది. కారణాలు తెలియదు వంగవీటి సినిమా విషయంలో మీడియా రాంగోపాలవర్మకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. బహుశా చాలాసార్లు తమను వెర్రిపప్పలను చేసాడనే కక్ష ఏమో.

వంగవీటి సినిమా ప్రచారంలో భాగంగా టి.వి స్టూడియోల చుట్టూ తిరుగుతున్న రాంగోపాలవర్మను డైరక్ట్‌గా మతి స్థిమితం లేదని వాఖ్యానించడానికి మీడియా వెనుకాడటం లేదు. రిలీజ్ రోజు నుంచే వంగవీటి ఫ్లాప్, వర్మ తుస్స్ అని కూడా మీడియా ప్రచారం చేస్తుంది.

Filed Under: Extended Family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *