న్యూ ఇయర్‌కు కాటమరాయుడు టీజర్

Share the joy
  •  
  •  
  •  
  •  

తమిళ హిట్‌ ‘వీరమ్‌’కి రీమేక్‌గా రూపొందుతున్న కాటమరాయుడు సినిమాలో పవన్‌ రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్‌ ప్రీ–లుక్‌ పోస్టర్‌గా ఒక స్టిల్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో పంచెకట్టులో ఉన్న పవన్‌ కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి.

సినిమాకు పబ్లిసిటీ & హైప్ చాలా ముఖ్యం. పవన్‌కల్యాణ్ చాలా లేటుగా తెలుసుకున్నాడు. తెలుసుకున్నాడు అనుకోవడం కంటే, ఇప్పుడు ఏ సినిమాకైనా పబ్లిసిటీ అవసరం కావడంతో పవన్‌కల్యాణ్‌కు తప్పడం లేదు అనటం కరెక్ట్. ఆ బాద్యతను శరత్ మరార్‌కు అప్పజెప్పాడు. కుదిరినప్పుడల్లా హైప్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా కాటమరాయుడు స్టిల్స్.. న్యూ ఇయర్‌కు సినిమా టీజర్ రిలీజ్ చేస్తారంట. thanks to Change.

శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Filed Under: కాటమరాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *