1 2 3..

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా కిషోర్‌ కుమార్‌ పార్దసాని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కాటమరాయుడు’. తమిళంలో విజయం సాధించిన ‘వీరమ్‌’ చిత్రానికి రీమేక్‌. అభిమానులు కోరుకుంటున్నట్టుగా సినిమాను హైప్ చేసే ప్రయత్నంలో వున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ పవన్‌ పంచెకట్టుతో మాస్‌ని ఆకర్షించేలా ఉన్న ఓ ఫొటోను బుధవారం చిత్రబృందం అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో రెండు ఫొటోలు కూడా విడుదలయ్యాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేయనున్నారు. శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివబాలాజీ, అజయ్‌,కమల్‌ కామరాజు, అలీ, రావు రమేశ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Filed Under: కాటమరాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *