‘ఖైదీ నెం 150’ ప్రీ రిలీజ్ పబ్లిసిటీ/హైప్ ఫంక్షన్ డేట్ మార్పు

ఈ ఫోటో ఒక మెగా అభిమాని కష్టం(not pawanfans.com)

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ సంక్రాంతి సందర్బంగా విడుదల కానుంది. ఇప్పటికి రిలీజ్ అయిన నాలుగు పాటలు సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసాయి. మరింత హైప్ కోసం టీమ్ పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించాలని ప్లాన్ చేసి అందుకు వేదికగా విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంను నిర్ణయించారు. జనవరి 4న డేట్ ఫిక్స్ చేసుకుని ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. కొన్ని ప్రభుత్వ పరమైన కారణాల వలన విజయవాడలో జరగాల్సిన ఈ వేడుక ఆగిపోయింది. కారణాలు ఏమిటో ఇంకా తెలియదు.

దీంతో టీమ్ వెంటనే తేదీ, వేదిక రెండూ మార్చేశారు. జనవరి 7న గుంటూరులోని బిఆర్. స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను జనవరి 11న రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Filed Under: Featuredఖైదీ నెం 150

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *