శభాష్ నాగబాబు

మంచి సినిమా తప్ప, ఏమీ ఆశీంచని మెగా అభిమానులను అవమానించడం కాదు. అభిమానులకు మందలించవచ్చు. అవమానించడం కరెక్ట్ కాదు. మెగా అభిమానుల్లో పవన్‌కల్యాణ్ కు వున్న క్రేజ్ ను అపార్దం చేసుకొని, అది మెగాస్టార్‌కు అవమానం అని ఫీల్ అయ్యి, మెగా అభిమానులపై నోరుజారి ఎన్నో విమర్శలకు గురయ్యాడు నాగబాబు. కాని ఇప్పుడు, మైలేజ్ కోసం చిరంజీవి ఫ్యామిలీపై కారుకూతలు కూసే సెలబ్రేటీస్ ను తిడుతూ మెగా అభిమానులచే శభాష్ అని అనిపించుకుంటున్నాడు.

దేవిశ్రీ ప్రసాద్ ను పొగడటానికి రామ్‌చరణ్‌పై కారుకూతలు కూసిన యండమూరికి, ట్వీటర్లో చిరంజీవిపై చాలా తెలివిగా వ్యాఖ్యలు చేస్తున్నాని భావించే రాంగోపాలవర్మకు ఇలా పబ్లిక్‌గా తిట్టడంతో “శభాష్ నాగబాబు” అని మెగా అభిమానులు అంటున్నారు.

అభిమానులు తెలియనితనంతో/వెర్రితనంతోచేసిన తప్పులు మీద అయితే విరుచుకుపడ్డాడు కాని, కొంతమంది సెలబ్రేటీస్, ఓపెన్‌గా, సమయం సందర్భం లేకుండా, చిరంజీవిపై రెచ్చగొట్టుడు మాటలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదనే విమర్శలకు నాగబాబు ఫుల్‌స్టాఫ్ పెడుతూ ఇలా యండమూరిపై & రాంగోపాలవర్మపై చాలా ఘాటుగా స్పందించడం బాగుందని మెగా అభిమానులు అంటున్నారు.

మెగాస్టార్ అన్నయ్య మీద కృతజ్ఞత చూపించుకునే విధానం ఇది !!

ఒకప్పుడు పవన్ కల్యాణ్ మోహన్‌బాబు మీద .. రామ్‌చరణ్ దాసరి నారాయణరావు మీద .. ఘాటుగా స్పందించిన విషయం అందరికీ తెలిసిందే.

Filed Under: Featuredఖైదీ నెం 150

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *