చిరంజీవి గారికి సారీ

గౌరవం .. అది కొల్పోతే .. అదీ మనం అభిమానించే వాళ్ల దగ్గర నుండి కొల్పోతే .. ఇదోక కోణం.

ఒక మేధావి .. ఎవరికీ అందని అర్దంకాని తెలివితేటలు .. ఇలా “వీడు” “వాడు” “అక్కు పక్షి” “పనికి మాలిన వెధవ” అని పబ్లిక్‌గా తిట్టించుకొవడం. అదీ ఎవరినీ అనవసరంగా ఒక మాట అనని ఫ్యామిలీ చేత. ఇదోక కోణం.

రాంగోపాలవర్మ వుద్దేశం చిరంజీవిని అగౌరవ పరచడం కాకపొయినా, సరదాగా విమర్శించడం మొదలయిన ఆయన కామెంట్స్ .. మెగఫ్యామిలీ హర్ట్ అయ్యే రేంజ్‌కు చేరుకున్నాయి. ఇదోక కోణం.

Hemanth Kumar C R ‏@crhemanth
Moral of the day : There’s a big gap between what you say and how it is perceived…And it is a wide gap to bridge 🙂

రెండున్నర గంటలు పాటు హింస చూపిస్తూ, హింస వలన జరిగే కష్టనష్టాలు/బాదలు చూపిస్తూ, చివర్లో ఇలా వుండొద్దని మేసేజ్ ఇస్తూ వుంటారు. సినిమా లక్ష్యం అహింస అని అంటూ వుంటారు. నిజ జీవితంలో ట్వీటర్ మేసేజెస్‌ను కూడా అలానే వాడుకునే ప్రయత్నం చేస్తూ వుంటాడు రాంగోపాలవర్మ.

చిరంజీవి అంటే రాంగోపాలవర్మకు ఇష్టం అనేది నిజం. చిరంజీవి మీద చేసే విమర్శలు చాలామటుకు చిరంజీవి అభిమానుల మధ్య జరిగే విమర్శలు. కాని అవి అభిమానుల మధ్యే వుండవలసిన విషయాలు. ఇవి అసరాగా తీసుకొని ఒక వర్గం మీడియా మెగాఫ్యామిలీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది.

విమర్శలు కొంతవరకు చేయవచ్చు. పూరి జగన్నాధ్ తో చిరంజీవి 150వ సినిమా చేయలేదనే frustrationతో, హద్దు అదుపు లేకుండా ఖైదీ నెం 150 సినిమాపై విమర్శలు రోజురోజుకు పెంచుకుపొతున్నాడు. ఒక సినిమా మేకర్‌గా సినిమా కష్టాలు తెలిసి, ఒక సినిమాపై చేయకూడని విమర్శలు కూడా చెయ్యడం మొదలుపెట్టాడు.

రాంగోపాలవర్మ చేస్తున్న వెటకారం, ఖైదీ నెం. 150 చిత్రం ప్రీ లాంచ్ వేడుకలో మెగా బ్రదర్ నాగేంద్రబాబు ఓపెన్‌గా తిట్టవలసిన రేంజ్‌కు వచ్చే స్థాయికి వచ్చేసింది. ఎంతో గౌరవం పొందవలసిన రాంగోపాలవర్మ ఇలా నాగబాబు చేతిలో ఇంత పబ్లిక్‌గా “వాడు” “వీడు” “అక్కు పక్షి” “పనికిమాలిన వెధవ” అని తిట్టుంచుకొవడం బాదాకరం.

ఈ వ్యాఖ్యలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో స్పందించారు. ఈ అంశంపై శనివారం రాత్రి వరుసపెట్టి ట్వీట్లు చేశారు. చివరగా.. తన తరఫున చిరంజీవిగారికి సారీ చెప్పమంటూ నాగేంద్రబాబును కోరారు. ఆయన ట్వీట్లలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి…

”నాగబాబు గారు, మీరు ట్విట్టర్‌లో లేరు కాబట్టి ఎవరైనా నా ఈ ట్వీట్లు మీకు చూపిస్తారని ఆశిస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. నేనేదో నా స్టైల్లో అందరి మీద అన్నింటి మీద ఏదో ఒక అభిప్రాయం చెబుతూ ఉంటాను. ఒట్టి మీ ఫ్యామిలీ మీదే కాదు.. అది వినే ఉంటారు. నా ట్వీట్లు మోదీ గారి దగ్గర నుంచి బచ్చన్‌గారి వరకు చివరకి నా మీద నేనే చాలా కామెంట్లు చేస్తూ ఉంటాను. కానీ మీరు చాలా అఫెండ్ అయ్యి, హర్ట్ అయ్యారని నాకు తెలిసింది కనుక నేను చాలా నిజాయితీగా మీకు, మీ కుటుంబానికి సారీ చెబుతున్నాను. నా ఉద్దేశం వేరే అయినా మీరు హర్ట్ అయ్యారు కనుక చిరంజీవి గారికి కూడా నా తరఫున దయచేసి సారీ చెప్పండి.. థాంక్స్” అని వర్మ ముగించారు.

Naga babu gaaru meeru twitter lo leru kaabatti yevarainaa naa ee tweetlu meeku choopistarani aashisthunnanu ..meerante naaku chaala ishtam
— Ram Gopal Varma (@RGVzoomin) 7 January 2017

Nenedho naa style lo andari meedha anniti meedha yedho oka opinion cheputhoo vuntanu ..votti mee family meedhe kaadhu ..adhi vine vuntaru
— Ram Gopal Varma (@RGVzoomin) 7 January 2017

Naa tweetlu Modi gari daggaranunchi Bachcgangaari Varakoo chivariki naa meedha nene chaala commentlu chesthoo vuntanu
— Ram Gopal Varma (@RGVzoomin) 7 January 2017

Kaani meeru chaala offend ayyi hurt ayyarani naaku thelisindhi kanuka nenu chaala genuine gaa meeku mee family ki sorry chepthunnanu
— Ram Gopal Varma (@RGVzoomin) 7 January 2017

Naa vuddeshyam vere ayina meeru hurt ayyaru kanuka chiranjeevigariki kooda naa tharapuna dayachesi sorry cheppandi..Thanks
— Ram Gopal Varma (@RGVzoomin) 7 January 2017

Filed Under: Featuredఖైదీ నెం 150

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *