వాడి(అక్కు పక్షి, పనిమాలిన సన్నాసి) సంగతి నేను చూసుకుంటా!!! -నాగబాబు

“నేను .. నా ఇష్టం” అంటే .. ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. కాని,

ఒకడిని గిల్లి .. గిల్లినోడు తిరిగి గిల్లితే, “నేను మాత్రమే గిల్లాలి .. నన్ను ఎవరూ గిల్ల కూడదు .. నా ఇష్టం .. నేను ఎవరినైనా గిల్లుతాను ..” అంటే, ఎలా కుదురుద్ది?

రాంగోపాలవర్మ మేధావులకే మేధావి. అనేక విధాలుగా మన తెలుగు మీడియాను వెర్రిపప్పలను చెయ్యడంతో, తన సినిమాల పబ్లిసిటీ కోసం తెలుగు మీడియాల చూట్టూ తిరిగేటప్పుడు, డైరక్ట్‌గా పిచ్చోడనే సంభోధించడం మొదలు పెట్టింది. యాంకర్స్ చేసే ర్యాగింగ్‌కు రెండు మూడు సార్లు సహనం కొల్పోయి, యాంకర్స్ ను ఇగ్నోర్ చేస్తూ ఫోన్ చెక్ చేసుకున్నట్టూ నటిస్తూ మూడిగా అయిపోయి, యాంకర్స్ ను ఎదేదో అనేసి, సారీ చెప్పడం రాంగోపాలవర్మకు కొత్త కాదు.

ఎవరి అవసరం కొద్ది వాళ్ళు పని చేస్తారు, తప్ప ఒకళ్ళకు ఒకళ్ళు అవకాశం ఇవ్వడం అనేది పెద్ద ట్రాష్ అనే రాంగోపాలవర్మ, “నేను ఎందరికో అవకాశాలు ఇచ్చాను” అని గొప్పలు చెప్పుకొవడమే కాదు, పాత అనుబంధాలతో సొంతడబ్బా ఫంక్షన్స్ కూడా జరుపుకుంటున్నాడు. ఎందుకింత insecurity వచ్చిందో. ఎందుకిలా సెల్ఫ్ డబ్బా కోసం ఆరాటపడుతున్నాడో అర్దం కాక తలలు పట్టుకుంటున్నారు ఆయన అభిమానులు.

ఏ ఇష్యూ మీదనైనా చాలా తెలివిగా కామెంట్ చేసే రాంగోపాలవర్మ, మెగాస్టార్ చిరంజీవి విషయంలో, హద్దులు దాటి, వ్యక్తిగత విమర్శలతో, చిరంజీవిని వెటకారం చెయ్యడం మొదలుపెట్టాడు. అసహనం కొల్పోయిన నాగబాబు, బండ బూతులు తిట్టినంతగా, పబ్లిక్‌గా (కోట్ల మంది వీక్షించే ఫంక్షన్‌లో) రాంగోపాలవర్మను తిట్టేసాడు. కల్మషం వుండనివాడిగా అమాయకుడిగా పేరున్న నాగబాబు చేతిలో ఆ తిట్లు తినడం రాంగోపాలవర్మ జీర్ణించుకోలేకపొతున్నాడు. మరింత frustrationకు గురయ్యి, వరుణ్ తేజ్‌ను కూడా ఈ వివాదంలోకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

వాడి(అక్కు పక్షి, పనిమాలిన సన్నాసి) సంగతి నేను చూసుకుంటా, మీరు వాడికి రెస్పాండ్ కాకండని నాగబాబు వరుణ్ తేజ్‌కు చెప్పినట్టుగా ఫిలింనగర్ టాక్.

జమానాలో మోహన్‌బాబు కామెంట్స్ కు పవన్‌కల్యాణ్ ఇచ్చిన స్పందనకు మెగా అభిమానులు ఎంత ఆనందించారో, ఇప్పుడు రాంగోపాలవర్మ కామెంట్స్ కు నాగబాబు ఇచ్చిన స్పందనకు అంతే ఆనందపడుతున్నారు.

Filed Under: Featuredఖైదీ నెం 150

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *