శభాష్ క్రిష్

Sai Dharam Tej ‏@IamSaiDharamTej
Hearing great reports about #GPSK congratulations to the whole team and @DirKrish, #NBK garu you are an inspiration to many of us 😊

2001 సంక్రాంతి మృగరాజు & నరసింహనాయుడు మాదిరి, ఒకరు సూపర్ హిట్ & ఒకరు సూపర్ ఫట్ కాకుండా .. 2017 సంక్రాంతి చిరంజీవి “ఖైదీ నెం 150” & బాలకృష్ణ “గౌతమి పుత్ర శాతకర్ణి” .. రెండు సినిమాలు ఫ్యాన్స్‌కు బాగా నచ్చడం చాలా చాలా హ్యాపీ న్యూస్.

క్రిష్ – ఒక గమ్యం సినిమా చాలు, క్రిష్ ఎంత గొప్పగా ఆలోచిస్తాడో మాత్రమే కాదు, తన భావాలను పదిమందికి ఎంత బాగా చెప్పగలడొ తెలియడానికి. ఆ పేరును చెడగొట్టుకునే సినిమాలు ఏమీ చెయ్యలేదు. ఏమి చెయ్యడు కూడా.

శాతకర్ణికి ముందే మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్‌తో “కంచె” సినిమా తీసాడు. అనుకున్నట్టుగా తీయగల్గాడు కాని, పబ్లిసిటీ విషయంలో & రిలీజ్ విషయంలో, తెలియనితనమో, భయమో, చాలా పొరబాట్లు జరగడంతో పాటు, కాలం కలిసి రాక, ఆ సినిమాకు పేరు అయితే వచ్చింది కాని, డబ్బులు మాత్రం ఆశీంచిన రీతిలో రాలేదు.

శాతకర్ణికి మంచి రిపోర్ట్స్ చెపుతున్నారు. బాలయ్య, బాలయ్య ఇమేజ్ & బాలయ్య ఫ్యాన్స్ అండతో, క్రిష్‌కు మంచి కమర్షియల్ దర్శకుడిగా పేరు రావాలని ఆశీద్దాం.

Filed Under: Featuredగౌతమీపుత్ర శాతకర్ణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *