నా తోలు మందం

 1. నేను అక్కు పక్షిని.
 2. నేను పనికిమాలిన సన్నాసిని.
 3. నా తోలు మందం.
 4. నేను వీర మెగాఫ్యానిని. ఒక మెగా ఫ్యాన్‌గా చిరంజీవి ఏమి చెయ్యాలో, ఆయన కంటే నాకే బాగా తెలుసు. ఇది నిజం అని అందరూ నమ్మాలి. నమ్మకపొతే మీ ఖర్మ.
 5. నాకొక ట్వీటర్ ఎకౌంట్ వుంది. నా గురించి తెలియాలంటే బాద్‌షా సినిమా చూడండి. ఆ సినిమాలో, నా గురించి పచ్చి నిజాలు చెప్పాడని, శ్రీనువైట్లని చిరంజీవి కంటే ఎక్కువగా అభిమానించడం మొదలుపెట్టాను.
 6. నేను అసలు అబద్ధాలు చెప్పను. ఎవరైనా నా ట్వీట్స్ వలన హర్ట్ అయితే, వాళ్ళు వెంటనే ఇంగ్లీష్ క్లాసులు తీసుకొవాలి.
 7. ఒకప్పుడు నన్ను ఎవరూ కేర్ చెయ్యాలని అనుకునే వాడిని కాదు. ఎవరినీ కేర్ చేసేవాడిని కాదు. ఇప్పుడు మాత్రం అందరూ నన్ను కేర్ చెయ్యాలని, నేను ఎవరినీ కేర్ చెయ్యను అనట్టు, నేను ఎవరికీ భయపడను అన్నట్టు, నేను ప్రముఖులను కెలుకుతూ వుండటం ఒక సరదాగా మొదలుపెట్టాను. ఇప్పుడు వ్యసనంగా మారింది.
 8. నేను సినిమా మేకర్నే. నేను నా ఇష్టం వచ్చిన సినిమాలు తీస్తాను. చిరంజీవి మాత్రం, ఏ సినిమా హిట్ అయితే, దాన్ని ఫాలో అవుతూ దాన్ని మించిన సినిమా తీయ్యాలి.
 9. నేను చాలా తెలివైనోడిని. నా తెలివితేటలు అందరూ గుర్తించాలని నేను పడే పాట్లు ఎవరూ గుర్తించడం లేదు. చిరంజీవితో సహా, నన్ను అపార్దం చేసుకునే వాళ్ళే తప్ప, నన్ను అర్దం చేసుకునే వాళ్లు ఎవరూ కనిపించడం లేదు.
 10. నేను పిరికోడిని. కాని రౌడి నెం 150 అని చెప్పుకు తిరుగుతూ వుంటాను.
 11. మీడియాను వెర్రిపప్పలను నేను చేయగలిగినట్టు ఎవరూ చెయ్యలేరు. వాళ్ళ వీక్‌నెస్ నాకు తెలిసినంతగా వాళ్లకు కూడా తెలియదు.
 12. నేను గిల్లితే, నాతో మాట్లాడి, నాతో కాంప్రమైజ్ అయితేనే నేను గిల్లడం ఆపుతాను. నన్ను తిరిగి గిల్లితే, మీ అంతు చూస్తా. మీ గురించి నిజాలన్నీ బయట పెడతానని భయపెడతా.
 13. నన్ను ఫాలో అయ్యే వాళ్లంతా వెధవలే. సారీ .. ఒకళ్ళను ఫాలో అయ్యే ఎవరైనా వెధవలే.
 14. తిట్టడం .. ఉత్తుత్తి హర్ట్‌ఫుల్ సారీ చెప్పడం నాకు అలవాటు.
 15. నా దగ్గర సరైనా సమాధానం లేనప్పుడు, నేను చెప్పే సమాధానాలు: “అప్పుడు అలా అనిపించింది .. ఇప్పుడు ఇలా అనిపిస్తుంది”,   “నా ఇష్టం”
 16. నా తోలు మందం.
 17. నేను పనికిమాలిన సన్నాసిని.
 18. నేను అక్కు పక్షిని.
 19. నేనెవరో ఎవరికీ చెప్పక్కర్లేదు.నేనెవరో అందరికీ తెలుసు.

Filed Under: FeaturedJust4Fun

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *