హా.. హా.. పవన్‌కల్యాణ్ కూడా గిల్లాడు …

నాగబాబు, ఒరేయ్ “పనికిమాలిన సన్నాసి .. అక్కుపక్షి ..” .. నువ్వు ఏవడ్రా .. అన్నయ్య ఇటువంటి సినిమాలు చెయ్యాలి .. అటువంటి సినిమాలు చెయ్యాలి .. అని చెప్పడానికి? – అని మేధావులకే మేధావి అయిన రాంగోపాలవర్మను పబ్లిక్ మీటింగ్‌లో అనడం బాదాకరం. ఆ గిల్లుడికి గిల గిలా చాలా రోజులపాటు ట్వీటర్లో కొట్టుకున్నాడు.

మీడియా వాళ్ళు అడగడంతో, ఇప్పుడు పవన్‌కల్యాణ్ వంతు వచ్చింది. సింపుల్‌గా చాలా గట్టిగా గిల్లాడు. “యాభై ఏళ్ళు వచ్చిన వ్యక్తి, మొన్న కూతురికి పెళ్ళి కూడా చేసాడు. అవన్నీ మర్చిపోయి, బూతు చిత్రాల గురించి విచ్చలవిడిగా మాట్లాడే వ్యక్తి గురుంచి నేనేమి మాట్లాడను?” అని అంటున్నాడు పవన్‌కల్యాణ్.

bottomline:
రాంగోపాలవర్మను ఎవరూ అర్దం సరిగ్గా అర్దం చేసుకొవడం లేదు. సారీ .. ఎవరూ అర్దం చేసుకోకూడదనే రాంగోపాలవర్మ ప్లాన్ బాగా వర్క్ అవుతుంది. తనను అందరూ పిచ్చోడు అనుకోవాలనుకుంటున్న రాంగోపాలవర్మ గెలిచాడు అని వర్గాలు అంటుంటే, మెగాఫ్యామిలీ తనకు భయపడి, మోహన్‌బాబు/దాసరి తో కాంప్రమైజ్ అయినట్టు కాంప్రమైజ్ అయ్యి సన్మానం చేస్తారని భావించిన రాంగోపాలవర్మ ప్లాన వర్క్ అవ్వలేదని కొన్ని వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.

రాంగోపాలవర్మ బూతు చిత్రాల గురించి మాట్లాడటం, తనకు ఒక రకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో ఒక భాగం అని పవన్‌కల్యాణ్‌కు తెలుసు. కాని తెలివిగా ఏ విధంగా గిల్లితే రాంగోపాలవర్మకు మండుద్దో పవన్‌కల్యాణ్‌కు చాలా బాగా తెలుసు. ఇప్పుడు రాంగోపాలవర్మ ఏ విధంగా రెస్పాండ్ అవుతాడో కూడా గెస్ చేసివుంటాడు.

Filed Under: Pawan KalyanFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *