పాటల్లొ వూపు లేకపొవడమే మెగాఫ్యాన్స్ నీరసానికి కారణం

పవన్‌కల్యాణ్‌ కాటమరాయుడు సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. మాములుగా అయితే, పవన్‌కల్యాణ్ సినిమా అంటే, ఆడియో రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ చేసే హాడావుడి అంతా ఇంతా వుండదు. ఈ సినిమాకు మాత్రం చాలా డల్‌గా వుంది. కారణం ఒకటి రెండు పాటలు మినహా, మిగతా పాటల్లొ వూపు లేకపొవడం సరి కదా, నీరసం వుంది. బాగోలేదని చెప్పలేని కొందరు మెగాఫ్యాన్స్ సిట్యువేషన్ సాంగ్స్ సరిపెట్టుకుంటున్నారు.

ఈ నీరసం ప్రభావం ఓవర్‌సీస్ ప్రిమియర్ కలక్షన్స్‌పై చూపించినా, మాస్ సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫస్ట్ డే కలక్షన్స్ ఆశీస్తున్నారు.

పవన్‌ నవ్వుకు కారణం వివరించిన అలీ:
మొన్న జరిగిన ‘కాటమరాయుడు’ చిత్రం ప్రీ-రిలీజ్‌ వేడుకలో కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ ఒక్కసారిగా పగలబడి నవ్వారు. దీంతో పక్కనున్న అలీ వేసిన జోక్‌కు ఆయన అంతలా నవ్వారని భావించారు. దీంతో అసలు అక్కడ ఏం జరిగిందో అని అభిమానుల మధ్య పెద్ద చర్చే నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో అలీ పవన్‌ నవ్వుకు కారణం చెప్పాడు. ప్రీ-రిలీజ్‌ వేడుకలో వేదికపై మాట్లాడుతున్న నిర్మాత.. ‘జుబ్బాలో పవన్‌ అందం రెట్టింపైంది’ అని అన్నారు. ఇదే సమయంలో పక్కనున్న వారితో ఏంటి హ్యాండ్సమ్‌గా ఉన్నారు.. హ్యాండ్సమ్‌గా ఉన్నారు.. అని అన్నిసార్లు అంటున్నారు.. కొంపదీసి మళ్లీ పెళ్లి చేస్తారా ఏంటి?’ అని అన్నానని అలీ వివరించారు. ఈ మాటలు విన్న పవన్‌ ఒక్కసారిగా పగలబడి నవ్వారని అలీ చెప్పారు.

Filed Under: Featuredకాటమరాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *