బాహుబలి2 చీఫ్ గెస్ట్‌గా రాంగోపాలవర్మ

‘బాహుబలి ది కన్ క్లూజన్’ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 26న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించనున్నారు.

ఒక చిన్న ఆలోచనతో, అతి తక్కువ రోజుల్లో, అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మింపబడే సినిమాలను ఇష్టపడే రాంగోపాలవర్మ, బాహుబలి లాంటి భారీ సినిమాలకు వ్యతిరేకి. మొదట్లో బాహుబలిని కూడా వెటకారంగా పొగడటం స్టార్ చేసాడు, కాని రాజమౌళి మాస్ పల్స్ క్యాచ్ చేసి విజయం సాధించే సరికి, రాజమౌళి విజయానికి రాంగోపాలవర్మ తలదించక తప్పలేదు. ఈ గబ్బుగాడితో మనకెందుకు అన్న రీతిలో రాజమౌళి కూడా రాంగోపాలవర్మకు గౌరవం ఇస్తున్నట్టు, భయపడుతున్నట్టు నటిస్తాడు. ఈ విధంగా రాజమౌళి రాంగోపాలవర్మ పల్స్ క్యాచ్ చేసి, తనకంటే రాంగోపాలవర్మ తన సొంత సినిమాలా ఫీల్ అయ్యేలా చేసాడు. చీఫ్ గెస్ట్‌గా రాంగోపాలవర్మను ఆహ్వానించినట్టు సమాచారం. రాంగోపాలవర్మ అంగీకరిస్తే, ట్వీటర్ ద్వారా ఈ ఫంక్షన్ మరింత మందికి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

bottomline:
రాంగోపాలవర్మకు ట్వీటర్లో 2.77M ఫాలోయర్స్ వున్నారు. పవన్‌కల్యాణ్ కు 1.54M ఫాలోయర్స్ మాత్రమే వున్నారు. ట్వీటర్లో తక్కువమంది ఫాలోయర్స్ వున్నారని, పవన్‌కల్యాణ్‌ను కాదని, రాంగోపాలవర్మను పిలవడాన్ని pawanfans.com తీవ్రంగా ఖండిస్తుంది.

Filed Under: బాహుబలిJust4Fun

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *