వంద కోట్ల మిస్టర్?

ఒకప్పుడు తెలుగుపరిశ్రమ ట్రేడ్ లెక్కలు మా సినిమా “షేర్” ఇంత .. మా సినిమా షేర్ అంత .. అని చెప్పుకునే వారు. ఇప్పుడు కొత్తగా, గ్రాస్ లో లెక్కలు చెపుతున్నారు. నిర్మాతకు ఇష్టం వచ్చిన లెక్కలు చెప్పడం పొస్ట్ రిలీజ్ పబ్లిసిటీలో ఒక భాగం. అసలు లెక్కలు బయటకు రావు.

ప్రిరిలీజ్ హైప్‌లో భాగంగా, బాహుబలి కలక్షన్స్ 1000 కోట్లు మించి వుంటాయని అంచనా వేస్తున్నారు. తెలుగుసినిమా కమర్షియల్ రేంజ్‌ను అమాంతంగా పెంచేసిన రాజమౌళికి ఏమి ఇచ్చినా, తెలుగుసినిమా పరిశ్రమ ఋణం తీర్చుకొలేదు.

వరుణ్ తేజ్ కమర్షియల్ రేంజ్ 20 కోట్లు లోపే. మహేష్‌బాబుతో దూకుడు ద్వారా మంచి కమర్షియల్ స్టామినా వున్న దర్శకుడిగా శ్రీను వైట్ల నిరూపించుకున్నాడు. ప్రస్తుతానికి ఫార్మ్ లో లేడు కాని, శ్రీను వైట్ల అంటే C/O ఎంటర్‌మైన్ మెంట్.

వరుణ్ తేజ్ కమర్షియల్ రేంజ్ 20 కోట్లు లోపే అని తక్కువ అంచనా వేయనక్కర్లేదు. జులాయి కి ముందు అల్లు అర్జున్ పరిస్థితి కూడా అంతే. అల్లు అర్జున్ రేంజ్ 100 కోట్లు. అల్లు అరవింద్ వ్యూహం ఎంతో హెల్ప్ అయ్యింది.

bottomline:
బాహుబలి కలక్షన్స్ 1000 కోట్లతో పొల్చుకుంటే, మెగా హిరో + శ్రీనువైట్ల రేంజ్ 100 కోట్లు సాధించకపొతే, రాజమౌళి సాధించి పెట్టిన కమర్షియల్ రేంజ్‌కు అవమానం. అల్లు అరవింద్ మాదిరి నాగబాబు వ్యూహం ఏమీ లేదు కాని, లక్ కలిసొస్తే మంచి కమర్షియల్ హిట్ అయ్యే ఛాన్స్ వుంది. హైప్ చేయగల్గాలి.

Filed Under: Featuredమిస్టర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *