హైప్.. మేనేజ్ చేస్తే వచ్చేది కాదు

ఒక తెలుగుసినిమాకు జాతీయస్థాయిలో రిలీజ్‌కు ముందు ఇంత హైప్ రావడం ఇదే మొదటిసారి. హిందీ/తమిళ్ వాళ్ళను ఏ రేంజ్‌లో అలరిస్తుందో కాని, తెలుగువాళ్ళ ఎమోషన్స్ మాక్సిమమ్ రేంజ్‌కు తీసుకొని వెళ్ళబోయే సినిమా అని అందరూ డిసైడ్ అయిపొయారు.

హైప్.. మేనేజ్ చేస్తే వచ్చేది కాదు. రాజమౌళి ఏదైతే కలగన్నాడో అది నిజం అయ్యింది. బాహుబలి సినిమా సృష్టికర్త రాజమౌళి అయినా, ఇది మా సినిమా అని ప్రతి తెలుగోడు ఓన్ చేసేసుకున్నారు.

ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమాను హైప్‌కు తగ్గట్టుగానే భారీగా రిలీజ్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు. తెలుగుసినిమా రేంజ్ ఇంతుందా అని నిరూపిస్తున్న రాజమౌళికి తెలుగుసినిమా ఇండస్ట్రీ ఎంతో ఋణపడి వుంటుంది.

కొన్నిచోట్ల బాహుబలి-1 ను బ్రేక్ చేసిన ఖైదీ నెం150 తో 150 కోట్లు సాధించిన చిరంజీవి, రెట్టించిన ఉత్సాహంతో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తన తర్వాత సినిమా మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమాకు ఎంత ప్రిరిలీజ్ హైప్ వస్తుందో చూడాలి.

ఆ ఒక్క సినిమాకే కాదు, నెక్స్ట్ రాబోతున్న హిరోలందరి సినిమాలపై మంచి హైప్ వుంది.

  1. హరీష్‌శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్. -హరీష్‌శంకర్ అల్లు అర్జున్‌తో బాగా ట్యూన్ అవుతాడనే నమ్మకం ప్రేక్షకులకు వుంది.
  2. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు. తెలుగు తమిళ్ .. ఎదో కొత్తదనంతో కూడిన కమర్షియల్ కథ అనే నమ్మకం ప్రేక్షకులకు వుంది.
  3. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్. పవన్‌కల్యాణ్ తిక్కకు త్రివిక్రమ్ లెక్క సెట్ అయ్యి, మూడోసారి ముచ్చటగా భారీ హిట్ సాధిస్తారనే నమ్మకం ప్రేక్షకులకు వుంది.
  4. సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్. రామ్‌చరణ్ హార్డ్ వర్క్‌కు సుకుమార్ రైటింగ్స్ తోడయ్యి, ఈసారి మంచి కమర్షియల్ సాధిస్తారనే నమ్మకం ప్రేక్షకులకు వుంది.
  5. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బాలయ్య బాబు. హైప్ అంటే.. ఎప్పటిలానే, పూరి జగన్నాధ్ బాలకృష్ణకు పొకీరి లాంటి సరప్రైజ్ యూనివర్సల్ హిట్ ఇస్తాడని ఆశ ప్రేక్షకులకు వుంది.
  6. పవర్ బాబీ దర్శకత్వంలో జూ ఎన్.టి.ఆర్. ఈసారి తన సొంత కథతో వస్తున్న బాబీ, కచ్చితంగా భారీ కమర్షియల్ విజయం సాధిస్తాడనే నమ్మకం ప్రేక్షకులకు వుంది.

bottomline:
తెలుగుసినిమా రేంజ్ పెంచిన రాజమౌళి👌👌👌

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *