‘బాహుబలి 2’ విశ్రాంతి ఘట్టం -పవర్ స్టార్ vs కన్నింగ్ స్టార్

ఒకప్పుడు మెగా అభిమానుల అండ కోసం చిరంజీవి లేదా పవన్ కల్యాణ్ ను ఫుల్‌గా వాడేసుకున్న అల్లు అర్జున్, ఇప్పుడు తన కొచ్చిన స్టార్డం తన కష్టార్జితం ప్లస్ తన తండ్రి ప్లానింగ్ వలనే అని తెగ ఫీల్ అయిపొతున్నాడు. చిరంజీవిని మెగాస్టార్ చేసింది కూడా తన తండ్రి అల్లు అరవిందేనని నోరు జారాడు.మెగాఫ్యాన్స్ మధ్య అఫీషియల్ గా పుల్లలు పెట్టిన ఘనత కన్నింగ్ స్టార్ దే. మెగా అభిమానులతో పని లేకుండా, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కేరళలో కూడా తన సొంత ఫ్యాన్స్‌ను క్రియేట్ చేసేసుకున్నాడు. ఈ పెయిడ్ ఫ్యాన్స్ సోషల్ మిడియాలో చాలా యాక్టివ్ గా వుంటారని పబ్లిక్ అనుకుంటూ వుంటారు.

‘బాహుబలి 2’ విశ్రాంతి ఘట్టం చూస్తున్నప్పుడు మెగా ఆడియో ఫంక్షన్స్ గుర్తుకు వచ్చాయి. పవర్ స్టార్ పవర్ స్టార్ అనే అరుపులు, మిగతా హిరో ఫ్యాన్స్‌కు ఎంతటి అసూయను కలుగజేసాయో, ఆ అసూయను పవన్ ఫ్యాన్స్ ను విమర్శించడం ద్వారా అల్లు అర్జున్ లాంటి కన్నింగ్ స్టార్ బయటపడిన సంగతి తెలిసిందే.(కన్నింగ్ స్టార్ ఎందుకంటే,పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరవడం తప్పు, మెగాస్టార్ మెగాస్టార్ అనో స్టైలిష్ స్టార్ స్టైలిష్ స్టార్ అని అరవడం తప్పు కాదు అని అనడం).

‘బాహుబలి 2’ విశ్రాంతి ఘట్టం చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఏమని ఫీల్ అయ్యారో, అదే నిజం అంటున్నాడు బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌.

‘బాహుబలి 2’ విశ్రాంతి ఘట్టం ఎలా ఉండాలి? అనే విషయంలో చాలా రకాలుగా ఆలోచించాం. ‘భళ్లాల దేవుడికి పట్టాభిషేకం జరుగుతుంది.. కానీ సంతృప్తిగా ఉండలేడు. బాహుబలికి జనం పడుతున్న నీరాజనాలు చూసి అసూయతో రగిలిపోతాడు…’ ఇదీ మేం అనుకొన్న కాన్సెప్ట్‌. దాన్ని ఎలా చూపించాలా? అని తర్జనభర్జనలు పడుతున్న సమయంలో అనుకోకుండా టీవీ చూశా. ఏదో ఆడియో ఫంక్షన్‌ జరుగుతోంది. పవన్‌ కల్యాణ్‌ అక్కడ లేడు. కానీ.. పవన్‌ పేరు పలికినప్పుడల్లా… జనం వెర్రిగా వూగిపోతున్నారు. ఐదు నిమిషాల పాటు ఎవరేం మాట్లాడినా వినిపించడం లేదు. ఆ సమయంలో వేదికపై ఎవరున్నా, హీరో ఎవరైనా సరే… అసూయ పడాల్సిందే. ‘ఇదేదో బాగుంది కదా’ అనుకొన్నాం. వెంటనే… ఆ సన్నివేశం రాసేశా. ఆ విధంగా విశ్రాంతి ఘట్టానికి పవన్‌ కల్యాణే స్ఫూర్తినిచ్చాడన్నమాట’’

—-బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌

పబ్లిక్ ఫంక్షన్స్ లో పవన్ కల్యాణ్ పేరు చెపితే వచ్చే రియాక్షన్ ఇప్పుడు మొదలైంది కాదు. ఆ వైబ్రేషన్ పవన్ కల్యాణ్ కు వచ్చింది చిరంజీవి నుండే. మెగా ఫంక్షన్స్ లో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడమని మెగాఫ్యాన్స్ నుండి ఒత్తిడి వుంటుంది. ఇదేమి కొత్తగా మొదలైంది కాదు.

చిరంజీవి రాజకీయ వైఫల్యంతో, పవర్ స్టార్ పవర్ స్టార్ అనే అరుపులకు చిరంజీవి కొద్దిగా అసహనంగా ఫీల్ అవుతున్నాడు. నాగబాబు మెగాఫ్యాన్స్ ను బానిసల్లా ట్రీట్ చేస్తూ తిట్టాడు. కొద్దిగా కంట్రోల్ లోకి వచ్చి మేము పిలుస్తాం కాని వాడు రాడు అని, వాడిని వెళ్ళి అడగండి అని మందలించాడు. ఇదే పెద్ద తప్పు అనుకుంటే, మెగాఫ్యాన్స్ మరింత రెచ్చగొడుతూ “నేను చెప్పను” అని ఒకసారి కాదు, మీడియాకు కూడా అదే మాట చెప్పి, పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరవకూడదు, అరిస్తే మెగాస్టార్ మెగాస్టార్ అనో, స్టైలిష్ స్టార్ స్తైలిష్ స్టార్ అనో అరవాలన్నట్టుగా మెగాభిమానులను, కన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ ఆదేశించాడు.

ఈ విధంగా మెగాఫ్యాన్స్ మధ్య పుల్లలు పెట్టేసాడు. తనసినిమాల హాడావుడికి మెగాఫ్యాన్స్ తో పని లేకుండా, తన పెయిడ్ ఫ్యాన్స్ తో సొషల్ మిడియాలో, సౌత్ ఇండియా మొత్తం హాడావుడి చేయించుకుంటున్నాడు. అల్లు అర్జున్ కన్నింగ్ మాటలను నమ్మేసిన ఒక మెగా అభిమానుల వర్గం పవన్ కల్యాణ్‌ను ద్వేషించడం మొదలుపెట్టింది.

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *