చిరంజీవి .. రాజమౌళి

చిరంజీవి ఫార్మ్ లో వున్నప్పుడు మొదటి పది స్థానాలు చిరంజీవే అనే వారు. చిరంజీవికి, వేరే హిరోలకు అంత గ్యాప్ వుండేది. చిరంజీవి తర్వాత ఆ స్థానం అలానే వుండిపోయిందని చాలామంది అనుకుంటూ వుంటారు.

ఎంత పెద్ద దర్శకుడితో చిరంజీవి పని చేసినా, చిరంజీవి సినిమాగానే చూసేవారు. సినిమా ఎంత పెద్ద హిట్ అయితే, ఆ పేరంతా చిరంజీవికే వచ్చేది. అదే తీరును రామ్ చరణ్, పవన్ కల్యాణ్, మహేష్‌బాబు, అల్లు అర్జున్ & ఎన్.టి.ఆర్ లు కొనసాగిస్తున్నారు.

బాహుబలితో హిరో డామినేషన్‌కు బ్రేక్ పడినట్టే వుంది. ప్రభాస్ లేకపొతే బాహుబలి అనే సినిమా వుండేది కాదు, అయినా ఎక్కువ రాజమౌళి గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక దర్శకుడు రేంజ్, హిరో రేంజ్‌కు పది రెట్లు అని రాజమౌళి బాహుబలితో నిరూపించాడు. ప్రస్తుతం, చిరంజీవితో సహా మన తెలుగు హిరోలందరూ రాజమౌళి మందు చాలా చాలా చిన్నవాళ్ళుగా కనిపిస్తున్నారు. అందుకు కారణం, మన హిరోలెవరూ నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకొలేకపొయారు.

bottomline:
ఒకప్పుడు చిరంజీవి 1 to 10 (telugu only)
ఇప్పుడు రాజమౌళి 1 to 10(National Level)

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *