హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారా?

south india movie is bigger than north india movie అని బాహుబలి మూవీ ప్రూవ్ చేసింది. ఈ విషయంలో సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ రాజమౌళికి ఏమి ఇచ్చినా ఋణం తీర్చుకొలేదు. రాజమౌళి ఇచ్చిన స్పూర్తితో కొన్ని సౌత్ ఇండియా ఫిలింస్ నేషనల్ లెవెల్లో రిలీజ్ చేయవచ్చు. అందులో మహేష్‌బాబు SPYDER ఒకటిలా వుంది. తన ప్రతి సినిమాలోనూ ముఖ్యమైన సామాజిక అంశాన్ని చాలా బలంగా చూపించే మురుగదాస్, ఈ చిత్రం బయో టెర్రరిజం నైపథ్యంలో ఉంటుందని అంటున్నారు. మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నడని టాక్. ఇది కచ్చితంగా దేశ వ్యాప్తంగా ఆకట్టుకునే పాయింటే.

‘స్పైడర్’ చిన్న టీజర్లోనే ఎంతో ఉత్కఠ క్రియేట్ చేయగల్గారు. సినిమాపై ఉన్న అంచనాల్ని ఇంకాస్త పై స్థాయికి తీసుకెళ్లింది. మహేష్ బాబును ఎంత స్టైలిష్ గా ప్రెజెంట్ చేశాడో ఈ గ్లింప్స్ వీడియోను కూడా అంతే స్టైలిష్ గా రూపొందించాడు మురుగదాస్. ఈ టీజర్ తో సినిమా సాంకేతికంగా గొప్ప స్థాయిలో ఉంటుందని, యాక్షన్స్, థ్రిల్స్ మెండుగా ఉంటాయని ఇట్టే అర్థమవుతోంది. అలాగే సంగీత దర్శకుడు హారీశ్ జైరాజ్ కూడా అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి ఆకట్టుకున్నాడు.

bottomline:
హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారా? బాహుబలి విజయాన్ని కంటీన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారా? THEY SHOULD

Filed Under: Featured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *