DJ Duvvada Jagannadham Trailer

Share the joy
  •  
  •  
  •  
  •  

జులాయి సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయిన బన్నీ, రేసుగుర్రంతో మహేష్‌బాబు & పవన్‌కల్యాణ్ లకు ఏమీ తక్కువ కాదని నిరూపించుకున్నాడు. సరైనోడు సినిమాతో మెగాఫ్యాన్స్ మధ్య ఆఫీషియల్‌గా పుల్లలు పెట్టడంతో పాటు, పక్కా మాస్ మూవీతో కూడా సూపర్ హిట్ కొట్టగలనని నిరూపించుకున్నాడు.

వరుడు పక్కా మాస్ మూవీని క్లాస్ మూవీగా పబ్లిసిటీ చేస్తూ ప్రేక్షకులకు సరప్రైజ్ ఇద్దామనుకుంటే, ప్రేక్షకులు డైజస్ట్ చేసుకొలేకపొయారు. అదొక గుణపాఠం. సినిమా టార్గెట్ ప్రేక్షకులెవరో, అదే విధంగా పబ్లిసిటీ చెయ్యాలని తెలియజేసిన సినిమా వరుడు.

డి.జె దువ్వాడ జగన్నాధం అంటే కేవలం వినోదాత్మక సినిమా అనుకున్నారు. ఇది పక్కా మాస్ సినిమా అని తెలియజేస్తూ, ట్రైలర్ కట్ చేసిన విధానం బాగుంది. “ట్రైలర్ హరీష్ శంకర్ రేంజ్‌లోనే వుంది. సినిమా హిట్ అయితే, అది కేవలం బన్నీ పుణ్యమే” అని అంటున్నారు నెట్ జనులు.

Filed Under: DJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *