రిలీజ్ ఎప్పుడు సార్?

తెలుగుసినిమా రేంజ్ కేవలం 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు కాదు. తెలుగుసినిమా రేంజ్ “ఇంత” అని నిరూపించాడు రాజమౌళి. త్రివిక్రమ్ రాజమౌళికి ఏ మాత్రం తక్కువ కాదు.

రాజమౌళి మార్గం వేసేసాడు. ఆ మార్గంలో ప్రయాణం చెయ్యడానికి ఐదేళ్ళు పనిచేయక్కర్లేదు.త్రివిక్రమ్ లాంటి సత్త కలిగిన వాళ్ళు కష్టంతో పాటు, దేశం అంతా రీచ్ అయ్యేలా వ్యూహరచన చేసుకుంటే, ఈజీగా సాధించేయవచ్చు. బాహుబలి సాధించినట్టు 2000 కోట్లు కాకపొయినా, నాలుగోవంతు 500 కోట్లుకు తీసుకొనివెళ్ళగలిగినా గ్రేటే.

bottomline:
క్రిష్, త్రివిక్రమ్ & సుకుమార్ లాంటి దర్శకులు తమ సినిమాలు తెలుగుకే పరిమితం చెయ్యకుండా, రాజమౌళి చూపించిన మార్గంలో ప్రయాణం చేస్తూ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా, ఎక్కువ డబ్బులు సంపాదించేలా వ్యూహం అవసరం ఎంతైనా వుంది.

పవన్‌కల్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా అసలు ఏ జోనరో ఎవరికీ తెలియదు. రిలీజ్ సెప్టెంబర్ అన్నారు. ఆలోపు అయ్యే సూచనలు అసలు వినిపించడం లేదు. దసరా సీజన్ కాకపొతే, సంక్రాంతి సీజన్‌ని రామ్‌చరణ్ బుక్ చేసేసుకున్నాడు.

రిలీజ్ ఎప్పుడు సార్?

Filed Under: Pawan KalyanFeaturedరంగస్థలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *