వాస్తవం ఏమిటనేది దేవుడొక్కడికే ఎరుక

అబద్ధం వెనుక మేలు వుంటే అబద్ధం నిజం. నిజం వెనుక మోసం వుంటే నిజం అబద్ధం. ఇది నిజమైన అబద్ధం అనిపించే నిజం.

అవసరం లేని చిన్న చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు ఆడటం వలన, ముఖ్యమైన విషయాల్లో నిజం చెప్పినా ఎవరూ నమ్మరు

అవాస్తవాలను కూడా వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నప్పుడు, వాస్తవాలను గుర్తించడం కష్టమైపోతుంది ..

వాస్తవం ఏమిటనేది దేవుడొక్కడికే ఎరుక

–xyz

మంచోడికి మంచేదో చెప్పాల్సిన అవసరం లేదు. చెడ్డోడికి చెప్పినా పట్టించుకోడు. నిజమైన అభిప్రాయంలో తప్పు ఒప్పులకు తావు లేదు. ఎంత ఎక్కువ కష్టపడి పనిచేస్తే , అంతకు డబుల్ అదృష్టం కలిసొస్తుందనేది నిజం.

రాజకీయం అంటే దోచుకొవడం, దోచిపెట్టడం అనే ధోరణి మారాలి. రాజకీయాలు అడ్డుపెట్టుకొని తప్పు చెయ్యడానికి భయపడాలి. ప్రజలు నిస్సాహాయులు. కులం మతం ప్రాంతం డబ్బులతో ప్రజలకు హక్కులు లేకుండా చేసేసారు నాయకులు. నాయకుల్లో self realization రావాలి.

మర్యాదలందుకొవాలనుకొవడం గౌరవం పొందాలనుకొవడం, అందరూ గుర్తించాలనుకొవడం ..కూడా డబ్బు సంపాదించుకొవాలనుకొవడం లాంటి మనిషి వీక్‌నెస్సే.

తప్పులను ఎత్తి చూపేవాళ్ళను నిర్భంధిస్తే, ఒప్పులను కూడా నిర్భంబంధించి ఒప్పించవలసి వచ్చే పరిస్థితులు వస్తాయి.ఏవో సాకులు చూపించి మభ్య పెట్టేయవచ్చు అనే వుద్దేశంతో వల్లకాని వాగ్దానాలు చెయ్యడం తప్పు.

Filed Under: Just4Fun

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *