సెప్టెంబర్ 21న ‘జై లవ కుశ’

తెలుగుసినిమా స్టామినా కేవలం 100 కోట్లు కాదు. ఒక వ్యూహం ప్రకారం వేరే బాషల్లో కూడా రిలీజ్ చేయగల్గితే 2000 కోట్లు అని రాజమౌళి నిరూపించాడు. నేషనల్ లెవెల్లో రిలీజ్ చేయతగ్గ సినిమాలు తెలుగులో చాలా నిర్మింపబడుతున్నాయి కాని, రాజమౌళిని ఎవరూ ఫాలో కాలేకపొతున్నారు.

నేషనల్ లెవెల్లో బాహుబలి తర్వాత, ఆ స్థాయిలో నిర్మింపబడిన చిత్రం మహేష్ బాబు ‘SPYDER’. ఈ దసరాకు రిలీజ్ అన్నారు. ‘SPYDER’ టీం బ్యాడ్ ప్లానింగ్ వలన, తెలుగులో మరో భారీ సినిమా నుంచి పొటీ ఎదుర్కొవలసిన పరిస్థితి వచ్చింది.

‘జనతా గ్యారేజ్’ హిట్ తర్వాత ఎన్టీఆర్, ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జై లవ కుశ’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. గత నెలలో విడుదలైన ఫస్ట్ లుక్స్ కూడా సక్సెస్ కావడంతో నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ తాజాగా రంజాన్ సందర్బంగా సినిమా విడుదల తేదీ సెప్టెంబర్ 21 అని ప్రకటించింది.

Filed Under: Featuredజై లవ కుశ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *