‘జై లవ కుశ’ సూపర్ హైప్

జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జై లవ కుశ. యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒకటి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అన్న ప్రచారం జరుగుతోంది. జూనియర్ సోదరుడు, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమా టీజర్ ను జూలై 6న 5.22 PM కు రిలీజ్ చేయబోతున్నట్టుగా ఎనౌన్స్ చేసారు.

  1. కరెక్ట్ ఎక్సపెటేషన్స్ సెట్ చెయ్యడం పబ్లిసిటి.
  2. సినిమా హిరో బట్టి, హిరొతో పనిచేసే దర్శకుడుని బట్టి, మిగతా టీం ను బట్టి, హైప్ క్రియేట్ అవుద్ది.

సినిమాను మంచి టాక్ రావాలంటే మంచి పబ్లిసిటీ అవసరం. భారీ ఓపినింగ్స్ రావాలంటే మంచి హైప్ అవసరం. హైప్ క్రియేట్ చెయ్యడం అంత ఈజీ కాదు. పెద్ద హిరో అయితే మినిమమ్ హైప్ వుంటుంది. భారీ కలక్షన్స్ కు ఆ హైప్ సరిపోదు. కచ్చితంగా మంచి డైరక్టర్ కూడా వుండాలి.

‘జై లవ కుశ’ సూపర్ హైప్ క్రియేట్ అయ్యింది. దానికి మొదటి కారణం ఎన్.టి.ఆర్ ఎంచుకుంటున్న సబ్జక్ట్స్ అయితే, రెండో కారణం డైరక్టర్ పవర్ “బాబీ”. ఈ సినిమాకు నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాత కావడంతో సినిమాపై ప్రేక్షకులకు మరింత నమ్మకం క్రియేట్ అయ్యింది.

అందుకు తగ్గట్టుగానే పబ్లిసిటీతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు ఈ చిత్ర యూనిట్. సరికొత్త కలక్షన్స్ క్రియేట్ చెయ్యడానికి అవకాశం వున్న మాస్ చిత్రం అనుకొవచ్చు.

Filed Under: Featuredజై లవ కుశ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *