“నిన్ను కోరి” – పక్కా క్లాస్

“భలే భలే మగాడివొయ్” సినిమా నాని కమర్షియల్ రేంజ్ అమాంతంగా పెంచింది. ఆ సినిమా సక్సస్ డైరక్టర్ మారుతి ఎకౌంట్ లోకో, నిర్మాతల ఎకౌంట్ లోకో వెళ్ళకుండా వరుస విజయాలు “జెంటెల్ మేన్” & “నేను లోకల్” సినిమాలతో నాని నిలబెట్టుకున్నాడు. అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులు సమానంగా ఆదరించేలా సినిమాలు చేస్తున్నాడు. “నిన్ను కోరి” సినిమా మాత్రం పక్కా క్లాస్ అనుకునేలా ఆడియో ఫంక్షన్లో నాని స్పీచ్ వుంది. పాటలు కూడా అలానే వున్నాయి.

నాని, నివేదితా థామస్ జంట‌గా న‌టిస్తున్న మూవీ నిన్ను కోరి. శివ నిర్వాణ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వ‌తున్నాడు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాని జులై 7 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సరైనోడు ఫేం “ఆది పినిశెట్టి” మరో కీలకమైన పాత్ర పోషించిన ఈ మూవీకి నిర్మాత డి వి వి దాన‌య్య‌.

ఓవర్సీస్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా, నిజంగానే నాని చెప్పినట్టు వుండి, ప్రేక్షకులకు కనెక్ట్ అయితే, ఓవర్సీస్ కలక్షన్స్ భారీగా వుండే అవకాశాలు వున్నాయి. క్లాస్ సినిమా కాబట్టి, మాస్ దూరమయ్యే ప్రమాదం కూడా లేకపొలేదు.

Filed Under: Extended FamilyFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *