క్లైమాక్స్ చిత్రీకరణలో పవన్‌ కల్యాణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా

పవన్‌ కల్యాణ్‌ – త్రివిక్రమ్‌ కలయికలో ముచ్చటగా మూడో చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఎస్‌.రాధాకృష్ణ నిర్మాత. వెంకటేష్‌ అతిథి పాత్రలో తళుక్కున మెరవబోతున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుథ్‌. ఈ సినిమాకు సంబంధించిన విషయాలేమి ఆఫీషియల్ గా బయటకు రావడం లేదు. టైటిల్ ఏమిటి ? రిలీజ్ ఎప్పుడు? సినిమా మీద ఎందుకు హైప్ క్రియేట్ చెయ్యడం లేదు ? అనే ప్రశ్నలతో అభిమానులు సతమతమవుతున్నారు.

ప్రస్తుతం రవివర్మ నేతృత్వంలో రామోజీ ఫిలింసిటీలో పతాక సన్నివేశాల్ని రూపొందిస్తున్నారట. ఈ నెలాఖరు వరకూ రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్‌ కొనసాగుతుందట. వచ్చే నెలలో యూరప్‌ వెళ్లనుందట చిత్రబృందం. అక్కడ పాటల్ని, కొన్ని సన్నివేశాల్నీ తెరకెక్కిస్తారట.

bottomline:
No hype. No publicity. రిలీజ్ ఎప్పుడో తెలియదు. దసరాకు మూడు పెద్ద సినిమాలు వస్తున్నాయి. అయోమయ స్థితిలో ఫ్యాన్స్.

Filed Under: Pawan KalyanFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *