మీడియాను కడిగిపారేసిన అల్లు అర్జున్

“నా మీద చాలా నెగిటివిటీ వుంది. నా పాజిటివిటీతో దాన్ని ఓడించగలనని” ఎంతో నమ్మకంతో ఎంతో హుందాగా మొన్న డిజె థాంక్యు ఫంక్షన్ లో చెప్పిన అల్లు అర్జున్, మాటకు కట్టుబడి లేకుండా తన నోటి దూలతో అందరినీ దూరం చేసుకునే పని పడ్డాడు.

మెగా ఫ్యామిలీ అంతా తన తండ్రి చేతిలో వుందనే పొగరు, మెగా హిరోలెవరికి తనను విమర్శించే స్థాయి లేదనే గర్వంతో, మైకు దొరికినప్పుడల్లా, నోటి దూలతో తన ఇమేజ్ తనే డామేజ్ చేసుకుంటున్నాడు.

సొషల్ మీడియా ఎఫెక్ట్, మంచయినా చెడయినా నిమషాల్లో వైరల్ అయిపోతుంది. ప్రతోడు తమ అభిప్రాయాన్ని అందరితో పంచుకొవాలన్న గుల ఎక్కువైంది. తమ అభిప్రాయాలను ఫిల్టర్స్ లేకుండా పంచేసుకుంటున్నారు. ఆ షేరింగ్ వ్యూస్ కంట్రోల్ చెయ్యడం అసాధ్యం. రివ్యూలు వ్రాసే వాళ్ళెవరూ జీనియస్లు కాదు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు.

ఎంత పెద్ద హిట్/ఫ్లాప్ సినిమాకయినా,

  1. సినిమా బాగా నచ్చినోళ్ళు వుంటారు
  2. పర్వా లేదు. ఒక్కసారి చూడొచ్చు అనే వాళ్ళు వుంటారు
  3. అతి అభిమానంతో ఆవేశంతో చూసి, సినిమాల మీద విరక్తి తెచ్చుకునే వాళ్లు వుంటారు
  4. సినిమా నచ్చకపొయినా, డబ్బా కొట్టేవాళ్ళు వుంటారు
  5. సినిమా నచ్చినా, బాగోలేదని దుష్పాచారం చేసే వాళ్ళు వుంటారు
  6. తమ అభిప్రాయాన్ని కచ్చితంగా చెప్పేవాళ్ళు వుంటారు

ఎవరెన్ని రకాలుగా కామెంట్ చేసినా, ఫ్యాన్స్ ఎంతో తెలివిగా కౌంటర్ ఇస్తూ వుంటారు. అలా మోసిన మెగాఫ్యాన్స్ నే చిన్నచూపుతో అవమానించి దూరం చేసుకున్నాడు. డిజె నెగిటివ్ టాక్ కు కౌంటర్ ఇచ్చే వాళ్ళు లేకుండా పొయారు. సొంతంగానో, మెయింటేన్ చేసే తన టీంతో ఆ నెగిటివ్ కామెంట్స్ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

మాస్ సినిమా కావడంతో మొదటి వారం మంచి కలక్షన్స్ సాధించినా, నెగిటివ్ టాక్ వలన, పైరసీ అందరికీ అందుబాటులో వుండటం వలన, ధియేటర్స్ కు వెళ్ళే ధైర్యం చెయ్యడం లేదనుకుంట. కలక్షన్స్ తో తెలిసినట్టు వుంది.

నోటి దూలతో, సరికొత్తగా నెగిటివ్ రివ్యూస్ వ్రాసిన వెబ్ మీడియాను కడిగిపారేసాడు అల్లు అర్జున్.

bottomline:
పబ్లిక్ ఫంక్షన్లో పబ్లిక్ ఏది ఆశీస్తున్నారో అది ఇవ్వకుండా, రివర్స్ లో వాళ్లకు క్లాసులు పీకడం ఏమిటో.

పబ్లిక్ ను కంట్రోల్ చెయ్యడం అనేది ఒక కళ. అది నేర్చుకునే పని చెయ్యకుండా, సభకు వచ్చిన వాళ్ళకు సంస్కారం లేదనడం ఏమిటో.

అందరి సపోర్ట్ తో ఎదగవలసిన సమయంలో, అందరినీ దూరం చేసుకొవడం ఏమిటో.

బ్యాడ్ ఐడియా !

బలుపో.. తెలియనితనమో .. ఛాదస్తమో .. రామ్ చరణ్ మీద కుళ్ళో .. ????

Filed Under: DJ

commentscomments

  1. Ganesh says:

    Pk ni 3vkram nithin lanti bajana batch functions ni kakunda mega audio functions ki rappinchandi. Ee problem chala varaku clear avuddi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *