గుడ్ జాబ్ విజయ్ దేవరకొండ

సినిమా బాగోలేదు .. విమర్శలు చెయ్యవచ్చు.

సినిమా జనాలకు నచ్చలేదు .. విమర్శలు చెయ్యవచ్చు.

సినిమా జనాలకు నచ్చింది .. కామ్ గా వుండకుండా “నాకు నచ్చలేదు .. ఎవరూ చూడకూడదు .. ఇది నా అభిప్రాయం .. నా హక్కు .. తొక్క .. తోటకుర .. అనవసరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు..” ఇదే రెచ్చగొట్టడం అంటే.

“అర్జున్ రెడ్డి” ఈ మధ్య కాలంలో ఒక సినిమా గురించి ఇంతలా మాట్లాడుకున్న సినిమా లేదు. ఫిదా లో హిరోయిన్ & తెలంగాన యాస గురించి ఎంతలా మాట్లాడుకున్నారో, అర్జున్ రెడ్డి గురించి పదింతలు మాట్లాడుకుంటున్నారు.

రెండు పాయింట్స్ గుర్తు పెట్టుకొవాలి:

  1. సినిమాను సినిమాగా చూడాలి.
  2. సెన్సార్ వాళ్ళు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చారు.

ఒక బస్ మీద కిస్సింగ్ పొస్టర్స్ వెయ్యడంలో విజయ్ దేవరకొండ చెపుతున్న లాజిక్ కన్విసింగ్ గా లేకపొయినా, చిల్ తాతయ్య అంటూ అతను రిప్లై ఇచ్చిన వ్యూహం, వేరే వాళ్ళు వివాదం చెయ్యకుండా ఆపిందని చెప్పవచ్చు.

bottomline:
గుడ్ జాబ్ విజయ్ దేవరకొండ. అనవసరంగా వివాదాలు చెయ్యాలకునే శక్తులను ఒక వ్యూహం ప్రకారం కట్టడి చేసిన తీరు అభినందనీయం. మెగా హిరోలు కూడా ఇలా వ్యూహం ప్రకారం తమ మీద వచ్చే విమర్శలను తిప్పికొట్టాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

Filed Under: Extended FamilyFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *