బోనస్

Keerthy Suresh‏Verified account @KeerthyOfficial
Just a glimpse from #PSPK25 Happy Birthday @PawanKalyan sir!

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 25వ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ మరియు అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమానౌ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగాm ఈ సినిమా టైటిల్ ఏమిటనేది ఇంకా ఖరారు చేయలేదు కాని, ‘పే.ఎస్.పీక్.కే#25’ హాష్ ట్యాగ్ తో ఆ చిత్ర యూనిట్ ఈ రోజు కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ దీర్ఘాలోచనలో ఉన్నట్లు ఒక చిత్రం ఉండగా, మరో చిత్రంలో కోపంగా నడుస్తూ వెళుతున్నట్లు కనబడుతోంది. కాన్సప్ట్ ఏమిటో ఎవరికీ అర్దం కాలేదు కాని, త్రివిక్రమ్ ఈసారి పవన్ ను కొత్తగా చూపబోతున్నారనే విషయం అర్థమవుతోంది.

అదేవిధంగా అభిమానులకు మ్యూజిక‌ల్‌‌ సర్‌ప్రైజ్‌ అంటూ ఓ పాటను విడుదల చేశారు. ‘బైటికొచ్చి చూస్తే టైమ్‌ ఏమో 3ఓ క్లాక్‌..’ అని సాగే ఈ పాటను సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఆలపించి, స్వరాలు సమకూర్చారు. వీడియోలో అనిరుధ్‌ పాట పాడుతున్న దృశ్యాన్ని చూపించారు. ఆయన పక్కన త్రివిక్రమ్‌ కూడా ఉన్నారు. చివర్లో పవన్‌ కుర్చీ తిప్పి.. నిశ‌బ్ధంగా నిల్చొని ఉన్న సన్నివేశాన్ని చూపించారు. వచ్చే ఏడాది జనవరి 10న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఈ ప్రచార చిత్రంలో పేర్కొన్నారు.

ఇప్పుడు హిరోయిన్ కీర్తి సురేష్, బోనస్ గా మరో పిక్చర్ రిలీజ్ చేసింది.

Filed Under: Pawan KalyanFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *