20 రోజుల పాటు యూరప్ షెడ్యూల్

pawan kalyan

గెలుపు ఓటములు నెంబర్ గేమ్స్ తో సంబంధం లేకుండా అగ్రపథాన దూసుకుపోతున్న హీరో పవన్‌కల్యాణ్. నేటి యువతరాన్నే కాదు, యువ హీరోలను కూడా ప్రభావితం చేస్తున్న ఏకైక తెలుగు హీరో పవన్‌కల్యాణ్.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్‌స్టార్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘అత్తారింటికి దారేది’ అనే టైటిల్ రిజిస్టర్ చేసారు కాని , అధికారికంగా మాత్రం ఆ టైటిల్‌ని ఖరారు చేయలేదు.

20 రోజుల భారీ షెడ్యూల్ నిమిత్తం ప్రస్తుతం ఈ చిత్రం యూనిట్ యూరప్ బయలుదేరింది. అక్కడ పవన్ కల్యాణ్, కథానాయికలు సమంత, ప్రణీతలపై రెండు పాటలను, ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు.

ఆ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశంలో ఉన్నాయి. బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోందని సమాచారం. దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్న ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా రిలీజ్ డేట్ ను బట్టి ఈ సినిమా రిలీజ్ డేట్ వుంటుంది. ‘ఎవడు’ ‘ఎప్పుడు’ అనేది రామ్ చరణ్ కు కూడా తెలీదు.

Filed Under: Pawan KalyanFeatured