2013 సంక్రాంతి విన్నర్

SVSC-Nayak

ఏ సంవత్సరమో తెలియదు. పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి సంక్రాంతి కి రిలీజ్ అయ్యింది. ఇంచు మించు అదే సమయంలో యం.యస్.రాజు సినిమా కూడా రిలీజ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ సినిమా ఎవరేజ్ టాక్ వచ్చింది. యం.యస్.రాజు సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చింది.

అదే అదనుగా ఆ సినిమా పబ్లిసిటీ టీమ్ మా సినిమా సంక్రాంతి విన్నర్ అన్ని చావగొట్టి చెవులు మూసుకునేలా చేసారు. అప్పుడు అనుకున్నాను ‘వీళ్ళేవరు రా బాబు’ .. మీ సినిమా బాగుందని పబ్లిసిటి ఇచ్చుకోండి .. ఇండైరక్ట్ గా మా సినిమా తక్కువ అని చెప్పడం దేనికి అని. మెగా సినిమా లకు అది అలవాటే కాబట్టి, అలా చెప్పుకుంటే కాని వాళ్ళకు గడవదు అని సరిపెట్టుకున్నాను.

ఇంత చీప్ గా మళ్లీ ‘నాయక్’ & ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నిర్మాతలలో ఎవరు దిగజారుతారో అని చూసాను, కాని సిట్యువేషన్ ను ఇద్దరూ డిసెంట్ గా డీల్ చేసారు.

2013 సంక్రాంతి విన్నర్ ఎవరు?
అభిమానులు మా సినిమా గొప్పంటే మా సినిమా గొప్ప అని కొట్టూకోపొతే ఫన్ వుండదు.

నేను భయపడినట్టుగా ‘అన్నయ్య vs కలిసుందాం రా’ కాలేదు. ‘కలిసుందాం రా’ ఈజ్ క్లియర్ విన్నర్. But this time, రెండు సినిమాలు ఇంచుమించుగా ఒకే రేంజ్ లో నడుస్తున్నాయి అని చెప్పవచ్చు.

నాయక్:
చిరంజీవి అభిమానులు, మాస్ ప్రేక్షకులు రిపీట్ గా చూస్తున్నారు. క్లాస్ కు బాగానే వుంది అనిపించే సినిమా. కామెడీ బాగా పండింది. డాన్సస్ ఎక్ ట్రార్డనరి. ఓవర్ వయలెన్స్ ఈజ్ మైనస్.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు:
కొందరికి బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా రోటిన్ గా లేదని కొందరికి నచ్చలేదు. నెం 1 సినిమా గా నిలుస్తుందనుకున్న వారి అంచనాలు రీచ్ అవ్వలేదు కాని, టాప్ 5 లో వుండే సినిమా.

Filed Under: Mega FamilyExtended Family