2014 ఎలక్షన్స్‌లో పవన్ రోల్

Pawan Kalyan

2014 ఎలక్షన్స్‌లో పవన్ రోల్ ఏమిటనే దానిపై భారీ చర్చలు జరుగుతున్నాయి, ఎందుకంటే పవన్‌కల్యాణ్ సమాజం గురించి ఎక్కువ ఆలోచించే వ్యక్తిగా ఆయన క్లోజ్ సర్కిల్ అభివర్ణిస్తారు.

పవన్‌కల్యాణ్ రాజకీయాలలోకి వస్తాడా? వస్తే ఆయనకు వున్నటువంటి ఆప్షన్స్ ఏమిటి?

ఆప్షన్ 1) సొంత పార్టీ పెట్టాలి:
సొంత పార్టీ పెట్టాలంటే, ముందుగా సొంత మీడియా వుండాలి. మనం చేసేది ఎంత దిక్కు మాలిన పని అయినా, మనం చేసేదే ఒప్పు అన్నట్టుగా అడ్డగోలుగా వాదించే నలుగురు కావాలి. ఫాలోయర్స్‌ను ప్రతిరోజు బ్రెయిన్‌వాష్ చేసి, వాళ్ళ సపోర్ట్ లెవెల్స్ పడిపోకుండా చూడాలి. ఆ సత్తా పవన్‌కల్యాణ్‌కు లేదు. సో, ఈ ఆప్షన్‌కు ఛాన్స్ లేదు.

ఆప్షన్ 2) తెలుగుదేశం పార్టీకి ప్రచారం చెయ్యాలి:
సీమాంధ్రలో రాజకీయం అంటే కులం. ఈ కులం పెద్దలు పలానా పార్టీకి సపోర్ట్ చెయ్యకూడదు. చేస్తే సొంత కులం వాళ్ళే ఎదురుతిరుగుతారు. తెలుగుదేశం పార్టీకి, పవన్‌కల్యాణ్ కులానికి అసలు పొత్తు కుదరదు. సో, ఈ ఆప్షన్‌కు ఛాన్స్ లేదు.

ఆప్షన్ 3) అన్నయ్య చిరంజీవితో కలిసి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చెయ్యాలి:
No Comments.

ఆప్షన్ 4) YSRCP:
జగన్‌కు అన్నీ వున్నాయి. పవన్‌కల్యాణ్‌కు చోటే లేదు. పవన్‌కల్యాణ్ అవసరమే లేదు. ఈ ఆప్షన్‌కు ఛాన్స్ లేదు.

ఆప్షన్ 5) లోక్‌సత్తా:
గెలిపించక పొతే నేను రాజకీయలకు దూరంగా వుంటాను అని, పవన్‌కల్యాణ్ రాజకీయలకు దూరంగా వుంటున్న సంగతి తెలిసిందే. ఓటమికి భయపడే పవన్‌కల్యాణ్‌కు ఈ పార్టీ సూట్ కాదు. సో, ఈ ఆప్షన్‌కు ఛాన్స్ లేదు.

ఆప్షన్ 6) ఆవేశం తగ్గించుకొని సినిమాలపైనే దృష్టి:
ఇది బెస్ట్ ఆప్షన్. పవన్‌కల్యాణ్ సినిమాలపైనే తన దృష్టి పెట్టడం అభిమానులకు ఆనందదాయకం. తన గురించి తను ఎక్కువ ఊహించుకొని, భారీగా ప్లాన్ చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యే కంటే, తన పరిధిలో, తన దగ్గరకు వచ్చిన వాళ్ళను ఆదుకుంటూ, సినిమాలతో అభిమానులను అలరిస్తే చాలు.

తమ బాగుకోసం ప్రజా జీవనాన్ని నాశనం చెయ్యడానికి పొటీ పడుతున్న రాజకీయ నాయకుల్లో మార్పు వచ్చి, మంచి చెయ్యడానికి పొటీ పడటం స్టార్ట్ చేస్తే, &
ఇంకో పదేళ్ళ తర్వాత
ఈ రాజకీయల గురించి ఆలోచించవచ్చు.

Filed Under: Pawan KalyanFeatured